నా కూతురు నాకు
ఆరో ప్రాణం...
మొదటిసారి
తనను చూసిన క్షణం..
నాలో నాకే
ఏదో తెలియని
ఉద్వేగ సాగరం..
మొదటిసారి
తనను చేతుల్లోకి
తీసుకున్న సమయం..
ఎప్పటికీ మరచిపోలేని
ఓ మధురానుభూతిని
మించిన అనుభవం..
-లక్ష్మీ నారాయణ D.
-
నా కంటిరెప్పవే నీవవుతూ...
కళ్ళముందునే ఆటలాడగా...
కోటలు మేడలు నాకెందుకురా...
నీ చిన్ని చిరునవ్వు చాలదా..
నే లేవగానే ఎదురవుతూ
నీ మాటే నాకు వినపడగా
ఆస్తులు అంతస్తులు నాకెందుకురా...
నీ అల్లరి మాటల మూటలు చాలదా...
నా హృదిసంద్రపు లహరుల లాహిరిలో...
ఆటలాడుతూ...
మాటలాడుతూ...
నవ్వులాడుతూ...
అల్లరి పెడుతూ....
కలకాలం నువ్వుండాలమ్మా...
నీ రక్షగా నేనుంటానమ్మా...
-
నా ఇంట సిరుల పంట..
ఆమెకి రోజూ
ఇంటిల్లిపాది ఇచ్చెను
ముద్దు మురిపాలంట..
ఘల్లు ఘల్లుమని
నడిచేనంట నట్టింట..
ఆడపిల్ల లేని ఇల్లు..
దేవత లేని గుడి అంట !!
తెలిసొచ్చేను.. నాకు
ఆడపిల్ల విలువ..
కలిసొచ్చేను
నా కుటుంబానికి
ఆమె చలువ!-
"అభయం"
అ’మ్మని మించి అనురాగాన్ని చూపేది..
భా’ర్యని మించి బాధలు పంచుకునేది...
యం’త్రాంగాన్ని మించి మంత్రాంగం చేసేది..!-
కుటుంబపు కట్టుబాట్లకు లోబడి,
కళ్యాణంతో మరో కుటుంబానికి అడుగిడి,
నెరవేరని కలలను కన్నీళ్ళతో
కనపడకుండా దాచేసి,కడవరకు
కుటుంబ సంక్షేమమే తన సంతోషముగా భావించేదే
కూతురు.-
పంచప్రాణం,..
సర్వస్వం,..
శ్వాస,..
ఉత్సాహం,..
ఊపిరి,..
అదృష్టం,..
ఆనందం
తను మా అమ్మే-
కూతురు మాటకి అల్లుడు ఎదురు చెప్పకపోతే
అల్లుడు మంచోడు
అదే కోడలు మాట కొడుకు ఎదురు చెప్పకపోతే
కొడుకు చవట దద్దమ్మ అయిపోతాడు ఏంటో మరి..!!!-
మా జీవితపు ఆకాశాన
సంతోషపు వెన్నెల చిందే
జాబిలి తానే
మా మనసు పూదోటలో
నిత్యం విరిసే వాడని ఆశల
కుసుమం తానే
ప్రతిక్షణము చిలిపి అల్లరితో
సందడి చేసే
చిన్ని కన్నయ్య తానే
ముద్దు ముద్దు మాటలతో
మమ్ము మురిపించే
తేనె చుక్క తానే
చిరు నవ్వుల
సిరులు చిందు
తరగని సిరి తానే
మా కలలకు రూపం,
మా ఆశకు ప్రాణం
మా అనంతమైన ప్రేమలోకం
మా జీవన సర్వస్వం తానే...
చక్కని తల్లి
నవ్వుల పాలవెల్లి
మా బంగారు పాప....
ఆద్య.....
-
నాన్నకి కూతురిని చూడాలని కలిగింది కలవరింత
పసిడి పువ్వు లాంటి తన నవ్వు చూస్తే కలుగును పులకింత
కళ్ళలో మెరుపు తారలను తలపించును మొదలుపెడితే గిలిగింత
ఆ అల్లరిని తలుచుకుంటే నాన్న మనసు ఇంటి వైపు లాగింది మరింత
తన ఆలోచనలతోనే గడిపేస్తాడు రోజంత
ఇళ్లు చేరిన నాన్నను అక్కున చేరి పాప కొట్టే కేరింత
పాపని ఎత్తుకుంటూ నాన్న మరిచెనే అలసటనంత
నాన్న భుజాలపై ఎక్కి ఏలుతుంది ప్రపంచానంత
ఇంతటి ఆనందం మరెక్కడైన దొరుకునా వెత్తికినను జగమంత
తన పాప యోగక్షేమాలకై పరితపిస్తాడు జీవితమంత.-
అమాయకత్వం కూతురులాంటిది
పరిపక్వత అమ్మలాంటిది
ఈ రెండు అందమైన భావాలు సమానంగా
కలిగి ఉన్న స్త్రీ నాకు కనిపిస్తే
ఆ స్త్రీని ఆలిగా చేసుకోవాలనిపిస్తుంది-