K Chandanabhaskar   (✍️గాయత్రి భాస్కర్ ✍️)
192 Followers · 268 Following

read more
Joined 15 August 2020


read more
Joined 15 August 2020
13 MAR AT 11:25

అందంగా కనిపించే
అందని ద్రాక్ష పళ్ళు..!
నింగినంటిన
తారల జిలుగులు!
నేలను పరుచుకున్న
నీలి సంద్రపు కెరటాలు..!
చల్లగాలికి కదిలే
కొబ్బరాకుల చప్పుళ్ళు..!
వెన్నెల్లో మిలమిలలాడే
గోదారమ్మ అలలు..!
ఎంతో అందమైన ఊహలు
ఎన్నో అనుభవించని
అద్భుతమైన అనుభవాలు!

-


5 NOV 2022 AT 19:39

నిశిలో శశిలా
ఆకాశంలో చుక్కలా
వెన్నెల వెలుగులా
సన్నజాజి మొగ్గలా
విరిసిన మందారంలా
అడవిలో చినుకులా
కలంలో సిరాలా
కాగితంపై అక్షరంలా
భూమిపై పచ్చని పైరులా,
పుడమిలో ముద్ద బంతిలా
రోజూ పూసే రోజాపువ్వులా
స్వచ్ఛంగా, అచ్చంగా
నీ మదిలో మల్లెపువ్వులా!

-


3 NOV 2022 AT 12:19

నీ కళ్ళకు అందమై
ఆశ్చర్యం కలిగిస్తున్నా!
మనసును తాకే ప్రణయ
సమీరమైపోతున్నా..!
నీ కళ్ళను ఆకట్టుకున్నా
మనసును హత్తుకున్నా
ఎదలో ఏవో భావాలను
నీకై ప్రేమతో మోస్తున్నా
ఈ భావాల భారం
దిగేది ఏనాటికో..
నా మనసున ప్రేమ
నీకు తెలిసేది ఎప్పటికో!

-


3 NOV 2022 AT 9:14

మనసుకు నీ అలజడితో
ముచ్చెమటలు పట్టిస్తున్నావ్!
కొత్తగా ఊహల రెక్కలను
విప్పార్చుకుంటూ
ఎగిరిపోతోంది మనసు పక్షి..!
ఈ విహాంగం అలసట లేని
ఊహా ప్రయాణం చేస్తోంది..!
ఎంతో అందంగా కనిపిస్తోంది
ఆకాశ వీధిలో చిరుగాలి ప్రయాణం!
మరో లోకాన్ని చేర్చే ఈ నడకలు
మన మనసును
తాకే మౌనపు అలల తీరం!

-


1 NOV 2022 AT 9:37

చిత్తు కాగితమే కదా అని
అనవసరంగా చులకన చూడొద్దు!
ఆ చిత్తు కాగితమే రేపటి
మీ అవసరం కావొచ్చు!

-


1 NOV 2022 AT 9:33

ఎన్ని సూర్యోదయాలు గడిచినా రాని అధైర్యం
చంద్రోదయం ఐతే, మోయలేని బ్రతుకు భారం!
కన్నీళ్ళ పర్యంతం అయినా తీరని శోక సంద్రం!
దాచుకోవాలనుకున్నా దాగని నిశీ..నిశ్శబ్దం!
బ్రతుకులు చితికిన అటుకులులా
విరిగిపోతున్నాయి! ప్రశాంతంగా బ్రతికేదెప్పుడో!

-


1 NOV 2022 AT 9:23

మనసున ముడివేసి బంధించావ్,
ఎటు పోతుంది.. అది నీదేగా..
ప్రాణం ఉన్నంతవరకు నేను నువ్వేగా!

-


1 NOV 2022 AT 9:03

నా మనసు
నీ ప్రేమాగ్నిలో
కాలిపోతోంది!
మంటలు రేగి
ఇంకొంచెం
దహించి వేస్తోంది!
పూర్తిగా బూడిద
కాక మునుపే
మంటలు చల్లారాలి!
పువ్వులా బ్రతికేయాలి!

-


31 OCT 2022 AT 7:29

కంకాల కరాళ కపాలాన్ని
స్మశాన సర్వ శక్తులని
సమాధాన పరిచే ప్రళయాగ్ని
నీ చేతుల బూడిద కావాలనే
నిష్కల్మష నివధిక నిర్యాణం
ఎంతమందికి దక్కునో ఓ శివయ్య
రుద్రభూమిని స్వచ్ఛమైన
పూలవనంగా మార్చే నీ త్రిశూలం
చాలుగా మా పాప ప్రక్షాళనకు!

-


30 OCT 2022 AT 18:58

నా గుండెకి నీ మాటల సవ్వడి
అందించావ్, అందుకేనేమో
సెలయేటి హోరులా
చెవులకు వినిపిస్తూనే ఉంది!

మనసుకు హత్తుకుంటుంది
కళ్ళకు కనిపిస్తుంది
పెదాలకు పలుకునిస్తుంది
మొత్తంగా మాయ చేస్తుంది!

-


Fetching K Chandanabhaskar Quotes