తీరం చేరని అలలెన్నో..
కాలం కదపని కథలెన్నో..
మౌనం విడువని జతలెన్నో..
మనసుని వదలని వ్యథలెన్నో..
-
నాలో నేను..!
నాతో నేను..!
నాకై నేను..!
అన్వేషిస్తున్నా
నిరంతరం..!!
అలుపెరగని
ఓ కడలి తరంగంలా..!!
గెలుపో ఓటమో
తెలియని
ఓ రణరంగంలా..!!
వెలుగు చీకట్లను
సమంగా అలుముకున్న
ఈ నా అంతరంగంలా..!!!
-లక్ష్మీ నారాయణ D.
-
అందమైన
నీ చిరునవ్వుకు
బంధీనై పోతున్నా...!
అలసటే లేని
నీ ఆటలను
ఆదమరచి చూస్తున్నా..!
అంతులేని
నీ అల్లరికి
మురిసి మురిసి పోతున్నా..!
అర్థమే లేని
నీ మాటలను
అన్నీ మరచి వింటున్నా..!
ఆనందానికి
అర్థం కొరకే
నిఘంటువులన్నీ వెతికాను..!
సంతోషానికి
తాళం చెవిని
నీ కంటిలొనే చూశాను..!!
-లక్ష్మీ నారాయణ డి.
-
జీవితం కూడా యుద్ధం లాంటిదే...క్షణ క్షణం పోరాడందే విజయం సిద్దించదు...
-
జ్ఞాపకాలు..
మధురోహల పరిమళమై
సుమగంధం వెదజల్లును...!
మోయలేని భారమై
మోడుబారి మిగిలిపోవు..!
౼లక్ష్మీ నారాయణ D.
-
కళ్ళల్లో దాగు కన్నీటి చుక్కలు
కడదాకా తోడు కన్నీటి చుక్కలు
కడలల్లే మారు కన్నీటి చుక్కలు
కవితలై పారు కన్నీటి చుక్కలు
౼లక్ష్మీ నారాయణ D.
-
జ్ఞాపకమై వెంటాడాలి
జ్ఞానబోధ చేయించాలి
చైతన్యం రగిలించాలి
చైత్రమై చిగురించాలి
-