ఒకప్పటి శివాలయం
నేటి తాజ్ మహల్.....!
వేములవాడ రాజన్న ముందర దర్గా
దౌర్జన్యపు కట్టడం.....!!
ఇస్లామున, క్రైస్తవాన (ఖురాన్; బైబిల్లో)
పరమత సహనం...???
హిందూయిజం మతం కాదు
విశ్వమంతా ఆచరించెంత గొప్పధర్మం
విశ్వానికే విద్యా బుద్ధులను, నైతికతను నీతిని నేర్పిన సనాతన ధర్మాన్ని
సర్వనాశనం చేసుకొని
పాచ్యా త్తపు మోజులో పడి నాశనం అవుతున్నా మారవు మన మస్తిష్కాలు-
కనిపించక కాటేస్తున్న కరోనాని
కాల్చి బూడిద చెయ్యమని
భానుడితో చెప్పవా ప్లీజ్.....-
కలిసి మెలిసి ఉంటేనే కదా
జీవితమంతా ప్రేమయం
ఏ బాధనైనా జయించగలం
కలిసి మెలిసి ఉంటేనే కదా
సమాజాన్ని సంస్కరించగలం
కలిసి మెలిసి ఉంటేనే కదా
గడ్డిపరకలన్ని గజాన్ని భందించగలవ్
చలిచీమలు సర్పాన్ని సంహరించగలవ్
పావురాలన్ని రాబందును చంపగలవ్
-
ఆశల ఆకాశాన్ని అందుకోవాలని ఆరాటం
కోరికల గుఱ్ఱాలను జయించాలని ఉబలాటం
తీరం సన్నిధిలో ఎపుడూ ఉండలేని
కడలి కెరటంలా మనస్సుతో రాజీకోసం
ప్రతినిమిషం పోరాటం
కోవత్తిలా కరిగిపోతున్నా వెలుగును పంచినట్టు
నిరంతరం త్యాగాలతో సహవాసం
ఇదేకదా మధ్యతరగతి జీవితం.....
-
నీ చూపు నాకు తొలిపొద్దు మేలుకొలుపు
నీ పిలుపు తట్టే నా గుండె తలుపు
నీ చిన్న తలంపుతో కలిగే మదిలోన మైమరుపు
-
బంగారం లాంటి మనసు నిండా
బాధలు నింపుకుంటే
మనిషిగా ఎలా బతుకుతావ్
బతుకంతా కన్నీటిలో ముంచేస్తే
ఎలా నవ్వగలుగుతావ్
జీవితమంతా విషాదపు చీకట్లో గడిపేస్తే
సంతోషపు వెలుగునెలా చూడగలుగుతావ్
మన జీవితంలో తెలుసుకోవాల్సింది ఒక్కటే
సలహాలు ఇచ్చేవారే తప్ప
సహాయం ఎవరు చేయరు
బాధను పంచుకోగలరే తప్ప
ఆ బాధను ఎవరు భరించలేరు
అందుకే
నీ బలము బలగం నువ్వే కావాలి
నీ బ్రతుకు యుద్ధంలో నిన్ను గెలిపించే
సైనికుడు నువ్వే కావాలి
నీ రక్షణ నువ్వే కావాలి
నీ లక్ష్యం నువ్వే చేరాలి
నీ జీవితాన శిలవు నువ్వే
శిల్పివి నువ్వే
నీ ఆత్మవిశ్వాసమనే ఉలితో
నిన్ను నువ్వే మలుచుకోవాలి
నీ పెదాలపై చిరునవ్వులు విరిసేలా
నీ హృదయపు అవనిపైన
సంతోషపు చిరుజల్లులు కురిసేలా
దేవుడిచ్చిన వరమైన జీవితాన్ని
అద్భుతంగా మలుచుకొని
ఆనందంగా బతకాలి.......
-
చెలీ మన మధ్య
రెప్పపాటు ఎడబాటునైనా
నేను భరించలేను
ఎందుకంటే....?
అది నన్ను కాల్చే నిప్పు కణం
నా మనసును చీల్చే వ్యథల శరం
నే భరించలేని ప్రత్యక్ష నరకం-
మా ఇంట ఆనందపు వెలుగులు నింప
ఈ జగానికి ఆదర్శపు మార్గం చూప
ఈ విశ్వాన దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయగ
ఒక్క పాదంతో నడుస్తున్న ధర్మాన్ని రక్షించగ
మరో అవతారమెత్తి ఈ లోకాన్ని
ప్రేమమయం చేయగ
రావా కన్నయ్యా మా ముద్దుల క్రిష్ణయ్య
-
మన జెండాలోనే ఉంది మన దేశపు గొప్పదనం
ఎరుపు రంగు ఆవేశానికి చిహ్నం
తెలుపు రంగు శాంతి అహింసల సంకేతం
పచ్చని రంగు ప్రతి దేశం
సస్య శ్యామలంగా ఉండాలనే సందేశం
జెండా గుండెపై కొలువైన అశోక చక్రం
నీతికి, న్యాయానికి, ధర్మానికి, నైతికవిలువలకి
భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం
ఆంగ్లేయుల హింసకు ఎదురు నిలిచి
పోరాడిన అహింసా దేశం మనది
నెత్తుటి త్యాగాల వెల్లువైనా
శాంతి, అహింసలే ఆయుధంగా పోరాడి
ఎందరో త్యాగదనులు తమ ప్రాణాలు వీడి
స్వాతంత్య్రం సాధించిన దేశం నాది
భారతీయుడిగా పుట్టినందుకు
రొమ్ము విరుచుకుని మీసం మెలేసే గర్వం నాది..
మేరా భారత్ మహాన్......
-