నిదురపోని కన్నుల్లో కుదురులేని నీ రూపం...
కలలను రానివ్వదు కలతను పోనివ్వదు....-
కళాత్మ బిరుదుల గ్రహీత
Proud VIZAGITE🤗
Hyderabad 📍
Associate Director🎥
... read more
మదిలోన భావాలు కదిలితే జ్ఞాపకం...
మనసైన రూపాలు కరిగితే జ్ఞాపకం...
కడవరకు తోడుగా నిలిచేది గురుతులే...
మనప్రేమ సౌధాలు మిగిలితే జ్ఞాపకం...
వినలేని కర్ణముకు ఎనలేని శబ్దాలు
మధురాల రాగాలు పలికితే జ్ఞాపకం...
నాకేమి మిగిలింది నిండైన ప్రేమలో...
మరుగవని గాయాలు రగిలితే జ్ఞాపకం...
ప్రతి తలపు ఒక శరము రవివర్మ మనసులో...
మృదువైన బాణాలు తగిలితే జ్ఞాపకం....-
హృదయంలో చోటివ్వలేను... క్షమించు...
ఇదివరకటి వారు విడిచిన శిథిలాల శకలాలు
ఎక్కడ గుచ్చుకుంటాయో అని భయం....-
రక్తపు మరకలు చెరిగిపోతాయి...
గాయపు గురుతులు అరిగిపోతాయి...
మనుషులు మసలిన తేలిక తీరుకు
మృదువగు గుండెలు విరిగిపోతాయి....-
కొందరికి చంపేశాక కూడా
సంతృప్తి ఉండదు...
గుర్తొచ్చినప్పుడల్లా వచ్చి
సమాధి తొలిచి శవాన్ని
పొడుస్తూ ఆనందిస్తుంటారు....-
భరతమాత నుదుటిపైన మురిసినదీ సింధూరం...
కఠినాత్ముల సంహరించి విరిసినదీ సింధూరం...
ప్రతీకార జ్వాలలతో రగులుతున్న దేశమందు
ఉగ్ర రోదనలను చూపి మెరిసినదీ సింధూరం....-
తెరిపిలేని తలపులతో నను కదపకు నేస్తం...
కాలం చదవని కథ రాస్తున్నా...
కథలో నువ్వుంటావు... నీ నవ్వుంటుంది...
కలవాలనుకుని అలసిపోయిన నేనుంటాను...
కన్నీటిని తుడుచుకుని నిలిచిన నా కళ్ళుంటాయి...
కానీ...
రాయడం పూర్తయ్యేసరికి
నువ్వు నాతో ఉంటావా అన్నదే సందేహం....-
కొత్త ఉదయం వస్తుంది...
కన్నీటి చారలు కరిగిపోతాయి...
తెర వెనుక గాథలు అంతమవుతాయి...
చేదు జ్ఞాపకాలు గతంలోకి మరలిపోతాయి...
బండరాళ్ళు పుష్పిస్తాయి...
పగిలిన హృదయం కోలుకుంటుంది...
రాతిగుండెలో ప్రేమ చిగురిస్తుంది...
అదిగో... కొత్త ఉదయం వస్తుంది....-
చెప్పుకుంటూ పోతే
హృదయాంతరంగాలలో
అణువణువుకీ ఒక కథ ఉంది...
కానీ...
చెప్పాలని మనసుకనిపించలేదు...
చెప్పుకునే మనిషి కనిపించలేదు....-
జనులకందనట్టు జన్మ సాగిన మేలు
నింగి జాబిలమ్మ వంగి రాదు
విలువ మరచు జనులు సులువుగ చిక్కినా
చెప్పెను రవివర్మ ఒప్పు వినుమ-