లక్షలు పెట్టి కార్లు
వేలకు వేలు పెట్టి
ఫాన్సీ నెంబర్లు,
లక్కీ నెంబర్లు తీసుకున్నా
ఏమి ప్రయోజనం
జరిగేది జరగకమానదు
విధి రాతను
తల రాతను
ఎవ్వరూ మార్చలేరు-
Sairam Electronics
Reporter(Lokal app news)
Joined yq ... read more
పొగపెట్టేందుకు కాదు
పొగమంచు తొలగించేందుకు
నాలుగు కవనములు రాసేందుకు
నలుగురిని ముందుకు కదిలించేందుకు
పదాల పదనిసలకు
పండాలి పసిడి పంటలు
పదాల గుసగుసలకు
పరువం పరవశించాలి
పదాల రుసరుసలకు
పరమాత్ముడే దిగి రావాలి
నాలుగు పదాలు పోగేస్తే
నలుగురికి ఉపయోగ పడాలి-
సహనం, ఓర్పు ఉంటే
సముద్రాన్నెనా దాటొచ్చు
సకల సౌఖ్యాలు పొందవచ్చు
అసహనం,ఏడ్పుతో
ఏమీ సాధించలేవు
పైగా సర్వం కోల్పోతావు-
ఆమె ఆకాశం
ఆమె అగ్ని
ఆమె జలం
ఆమె వాయువు
ఆమె ధరిత్రిధరణి
పంచభూతాలు ఆమె
ఆమే లేకుంటే అంధకారమే
ఆమె లేకుంటే సృష్టి వినాశనమే
ఆమె అనంతం అద్భుతం-
మా
పక్కింటి అమ్మాయే,..
చెవి కమ్మల కన్నా
అమ్మాయి ముక్కు మీద కోపం
ఇంకా బాగుంటుంది-
నీ గర్వం
చేస్తుంది నిన్ను సర్వ నాశనం
నీ స్వరం
చేస్తుంది సర్వం నీ వశం-
ఓ మనిషీ
కలికాలం ఇది
కాటేసే పాములకే
పాలు పోసి పెంచిపోషిస్తారు
పెంచుకునే కుక్క పిల్లలకన్నా
పెంచి పెద్ద చేసి ప్రోజకున్ని చేసిన
కన్నవారికి విలువ లేదిక్కడ-
మా వైక్యూలోని
చిట్టి చెల్లెలకు
బంగారు తల్లులకు
మా అక్కలకు అమ్మలకు
రాఖీ పండుగ
శుభాకాంక్షలు-
ఎన్నిసార్లు చెప్పినా
ఎదుటి వ్యక్తిలో
మార్పు రావడం లేదంటే
నీ మీద ధ్వేషమైనా ఉండాలి
నీ మాటలకు విలువ లేకుండాలి
లేదా నిన్ను దూరం
పెడుతున్నారని గ్రహించాలి-