Shravanthi Satyavarapu   (Shravanthi Shyam)
696 Followers · 67 Following

నా రచనలన్నీ నా ఊహలేనండి
Joined 8 January 2018


నా రచనలన్నీ నా ఊహలేనండి
Joined 8 January 2018
31 OCT 2024 AT 10:34

Celebrate the Light Within You,
Wherever You Are.

-


17 JUN 2024 AT 13:26

You are never a choice but a necessity.

-


12 JUN 2024 AT 14:31

It is essential to remember that the timing of our lives, like the timing of the trees, is unique to each of us.

-


15 AUG 2023 AT 18:25

నా చుట్టూ అల్లరిగా అలుముకున్న జ్ఞాపకాల్లా
ఎవరూ లేని ఏకాంతంలో నాతో నేనే నాలో నేనే

అప్పుడప్పుడు వచ్చి తాకే ఆనందంలా పరిమళిస్తూ సుమాలు
గలగల నవ్వులై ఒడిలో వాలి ప్రేమగా పలకరిస్తున్న భావన

విరిగిపడుతున్న ఆలోచనల్లా రాలుతున్న ఆకుల చిరు సవ్వల్లు
మదివీడిన కలలన్నీ దరిచేరి గదిని దాటి రమ్మంటూ చేస్తున్న సైగలా

దారులన్నీ నా చూపులతో నింపేసి వర్షించని మేఘాన్ని నేనై
నీకై ఎప్పటిలా అలుపెరుగక ఎదురుచూస్తూ కూర్చున్నా

-


14 AUG 2023 AT 12:54

పెళ్లితో ప్రేమకై అన్వేషణ ముగిస్తుందంటారు అందరూ.
కానీ నేను మాత్రం ప్రేమించే వ్యక్తి కోసం అన్వేషణ ముగిసి, ఆ వ్యక్తిని ఎలా ప్రేమించాలనే అన్వేషణ మొదలవుతుందని అనుకుంటాను

-


14 AUG 2023 AT 12:41

నీ వలపు మది తాకిన సమీరం లాగుంటుంది
ఆ తలపు నను వీడని భ్రమరం లాగుంటుంది

నీ చూపు తాకగానె శిలనైన నాకు
కన్ను కన్ను కలపడమే సమరం లాగుంటుంది

ప్రేమ అనే పదానికి ఇంత పటిమ ఎక్కడిదో
ఆ ఊహే వేసవిలో శిశిరం లాగుంటుంది

ఎంత కాదన్నా నీ వెంటే నడుస్తున్నా
నీ తీరే అసమ్మతి శిబిరం లాగుంటుంది

ఇన్ని నెలల నిరీక్షణ ముగిసేనా తొందరలో
నీ వాలుచూపు ప్రేమాలయ శిఖరం లాగుంటుంది

చెరిగిపోని ప్రణయాలు చరిత్రలో ఎన్నున్నా
మన ఇద్దరి కధ అమరం లాగుంటుంది

-


11 AUG 2023 AT 13:17

చూపు ఎంత అలిసిందో తోడు ఉన్న చుక్కల్ని అడుగు
ఓర్పు ఎంత విసిగిందో గోడు విన్న చంద్రుణ్ణి అడుగు

వేచి ఉన్న ఘడియలన్ని వెక్కిరించి వెళుతుంటే
అహం ఎంత అలిగిందో కమ్ముకున్న మౌనాన్ని అడుగు

ప్రతినిముషం నరకంగా రాతిరంత గండంగా
గుండె ఎంత పొగిలిందో ఆదుకున్న సూర్యుణ్ణి అడుగు

మనిషి కాదు ఉత్తి మాట కూడ జాడ లేకుంటే
మనసు ఎంత నలిగిందో నిలిచి ఉన్న ప్రాణాన్ని అడుగు

-


11 AUG 2023 AT 12:06

నవ్వుతూ చేతులు నులుముకుంటూ యోచిస్తున్నావా
సాఫీగా సాగలేక సాగుతున్న జీవితం పై అలిగివున్నావా

నీకు నచ్చిన రీతిలో లోకం మారునని అనుకున్నావా
ఎండనక వాననక నిశ్చలంగా నిలబడి నిరీక్షణలోనేవున్నావా

అంధకారంలో మునిగి మండుటెండలో మాడిపోతున్నావా
అయితేనేం కలలు అపురూపంగానే కంటునానని ఊరుకున్నావా

మున్ముందు ఇంకెన్ని భరించాలో అని భీతిల్లుతున్నావా
అలా అనుకుంటూ నిన్ను నీవు ప్రశ్నించుకుంటున్నావా

అడిగినవారికి చేతనైన సహాయమే చేసావు, చేస్తూనేవున్నావా
అవసరానికి వాడుకుని వదిలిన వారందరిలో ఒంటరివైన్నావా

పలుకరించి పబ్బం గడుపుకున్న వారిచే మనసువిరిగి
ముక్కలైతేనేం అద్దాన్నివి అద్దంలాగే ప్రతిబింబిస్తున్నావా

-


11 AUG 2023 AT 11:24

శుక్లపక్షములోని
జాబిల్లియే సాక్షి
నీమీద నా ప్రేమ
పెరుగుతూనే ఉంటుంది

-


11 AUG 2023 AT 11:07

కలతలను పెంచే కన్నీరు కూడా
నిన్ను చూసి ధైర్యంతో నవ్వాలి!
అలజడులను రేపే ఆలోచనలన్నీ
నిన్ను గమ్యానికి తీసుకువెళ్ళాలి!
అడుగు వేయక ఆపే అవరోధాలు
ఆత్మవిశ్వాస సోపానాలు కావాలి!
తలచిన ప్రతీ కార్యంలో పట్టుదల
నీతో ఉండి విజయభేరి మ్రోగించాలి!
ఆనందం ఉత్సాహం నిన్ను వీడక
మరెన్నో ఉత్సవాలు జరుపుకోవాలి!

-


Fetching Shravanthi Satyavarapu Quotes