QUOTES ON #మేడే

#మేడే quotes

Trending | Latest
1 MAY 2019 AT 1:30

లాల్ సలామ్ కామ్రేడ్స్...
ఈ లోకంలో అందరూ కార్మికులు కర్షకులే...
ఆ తెల్లదొరల కాలం పోయినా, దోచుకునే తీరు మాత్రం మారనేలేదు,
ఎప్పుడూ ఓ కొత్త ముసుగేసుకుని దోచేసుకుంటున్నారంతా...
దాన్ని గుర్తించి తిరగబడితేనే నువ్ బ్రతగ్గలవ్,
చూస్తూ ఉండిపోయావా, నీ పలుగు పార కూడా నీక్కాకుండా పోతాయ్ జాగ్రత్త...
విప్లవాలు, నినాదాలు ఎక్కడినుండో పుట్టలేదు కామ్రేడ్,
అన్యాయం నుండి వచ్చే ఆవేశంలోంచి పుట్టినవే అవన్నీ...
కార్ల్ మార్క్స్, లెనిన్ లాంటోళ్ళూ నీలాగే సహించి సహించి చివరకు తిరుగుబాటు తనాన్ని రిగిల్చారు అందరిలో...
ప్రశ్నించే తత్వాన్ని అలవర్చారు...
ముందుండి నడిపించే తీరుని నేర్పారు...
అలా నువ్వూ ఓ నాయకుడిలా నిలబడు నీ జనానికి,
అపుడు ఆ ఎర్రజెండా నీకు గర్వంగా చెపుతుంది
" లాల్ సలామ్ కామ్రేడ్ " అంటూ...
ఇంక్విలాబ్ జిందాబాద్... విప్లవం వర్ధిల్లాలి...
వెన్నెల సతీష్...

-


1 MAY 2019 AT 12:11

రాలే చెమట చుక్కలు..
ఒళ్ళంతా గాయాలు...
భరోసాలేని బ్రతుకులు...
ఎండావాన అన్నీ ఒక్కటే,
రేయి పగలుకి తేడా లేదు,
మూరెడు సంపాదన, బారెడు ఖర్చు...
ఇంతా చేసి చివరికి నువ్ పోయాక
ఓ ఖద్దరు చొక్కా నీ శ్రమకు ఓ దండేసి, దీపం వెలిగించి
నువ్ మా గుండెల్లో ఉంటావంటూ రెండు కన్నీటి చుక్కలు రాలుస్తుంది...
దండ వాడిపోతుంది, దీపం ఆరిపోతుంది,
కానీ ఎవడైనా వచ్చి తమ బ్రతుకుల్ని ఉద్దరిస్తాడేమోనని ఎదురుచూసే నీ కుటుంబం
ఆశలు మాత్రం ఎన్నేళ్ళయినా అలాగే ఉంటాయ్...
ఎందుకంటే , ఇవి నీ శ్రమను గుర్తించే రోజులు కావు,
నువ్ బ్రతికున్నపుడు నిన్ను, నువ్ పోయాక నీ పేరుని
వాడుకునే రోజులివి...
నిజమెరుగు కామ్రేడ్, నీతిన్యాయాల్లేవిక్కడ...
పోరాడి సాధించు ఏదైనా... లాల్ సలామ్...
వెన్నెల సతీష్...

-


1 MAY 2020 AT 17:11

గరిట పట్టని ఘనుడేడి
భార్య మాట వినని భర్తేడి...
లాక్డౌన్ సమస్తం
లాక్డ్ ఇన్ హర్ హ్యాండ్స్
కరోనా కంటకం తో
వంటకాలు మరింత
రుచి తేలెలే!
వంటింటి కార్మికులారా
శుభాకాంక్షలు💐💐
😊😊😊

-


1 MAY 2021 AT 10:47

పక్కనవాడి శ్రమను దోచుకునే కార్మిక నీకు నీ కష్టానికి కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు...

ఏ జీతం ఇవ్వకపోయినా పక్కనవాడి జీవితం పై శ్రద్ధ చూపి వాళ్ళు తుమ్మినా దగ్గినా పది మందికి చెప్పే వాళ్ళకు మీ శ్రమకు కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు

నిజాయితీగా ఉండే వాళ్ళను నమ్మకుండా మాటలు చెప్పేవాళ్లను నమ్మే గొప్పవాళ్ళకి శ్రామిక దినోత్సవ శుభాకాంక్షలు...

-



కదలండీ..కదలండీ...
యోధులారా
ధీరులారా
పోరాడే శక్తులారా
కదలండీ...కదలండీ...
బలవంతుల దోపిడీలు
దుర్మార్గుల దురాగతాలు
తుత్తునియలు చేసేద్దాం
కదలండీ..కదలండీ..
(క్రింద ఉంది)

-


1 MAY 2021 AT 12:24

నుదుటన చిమ్మే చెమట
చుక్కలు అగ్గై మండగలవని...
మానవ శ్రమను గౌరవించమని
గర్జించే క్షణాలు వున్నవని..
మొరటుగా వుండే చేతులకూ
గాయాలన్నవి నిత్యమని...
పిడికిళ్ళ బలంతో దౌర్జన్యాన్ని
అణిచే రోజోకటున్నదని...
స్వేచ్ఛగా పీల్చే ఊపిరి కోసం
త్యాగాలన్నవి తధ్యమని..
ఆకాంక్షించిన బ్రతుకుల కోసం
పోరు బాటలు తప్పవని..
రుజువు చేసిన రోజు ఇది.
నిప్పై ఎగసిన స్పూర్తి ఇది.

-


1 MAY 2018 AT 14:30

నిప్పు కణిక
మనసు వెనక
కష్టమే, సుఖం గనుక..
భారమనక
పనుల వెనక
ఆకలే, నిజం గనుక..
కూడు పడక
ప్రాప్తమనక
డబ్బు లేని, ఆశ గనుక..
మనసు గర్రుక
గాయమనక
కష్టజీవులం, గనుక..

-


1 MAY 2020 AT 3:49

కాయాకష్టం జేసీ
కడుపు నింపుకుంటోల్లం
మా కష్టం దారబోస్తం
కడుపులన్ని నింపేస్తం
ఊరువాడ ఊడ్చేస్తం
చెత్తలోనే పడుకుంటం
మా నెత్తురు చిందిస్తం
చక్రాలను తిప్పేస్తం
యంత్రాలను నడిపిస్తం
దేశాన్నే మేం మోస్తం
రక్తాన్నే రంగుజేసి
పోరాటం మేం జేస్తం

-


1 MAY 2019 AT 9:49

కర్మ కులం...కార్మి కులం
~~~~~~~~~~~~~~~~~~~~

కర్మలాచరించు వారందరు ఉందురొక్కచోటన్ కార్మికులం అని
కారాగారం వంటిదగు దేహమందు ఉంటు కార్మాగారమిదేనని
కర్మ సిద్ధాంతము అనునదొక్కటున్నదని ఎరుకతో మెలగాలని
కర్మాగారమందు శ్రమించుచున్న కర్మజీవులు ముక్తి నొందాలని

// కర్మకులం మనది...కార్మికులం మనము //

|| కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు ||

.....✒ రవీంద్ర నందుల

-



కార్మికులందరికీ
మే డే శుభాకాంక్షలు💪✊

-