నా దగ్గర ఇవ్వడానికి ఏమియునూ లేదు!ఖర్మలనబడు కట్టెలు తప్ప!
-
*in Yourquote - 18/07/2018
Completed Diploma from SV. Govt. polyt... read more
ఎపుడూ ఏదో ఒకటి... వస్తూనే ఉంటుంది... ఆలోచన
అంతర్మథనం జరిగితే జనియిస్తుంది... నూతన ఆలోచన
తిరుగే ఉండదులే...తిరిగి చూసే అవసరమే ఉండదులే
నాదేదీ లేదనుకుంటే దిగులన్నది మరి అసలే ఉండదులే
మోసే వాడికి తెలుసును బరువన్నది అసలుకు నిజమేలే
మేసే మేక కూసే గాడిద పాడే కోయిలలు... అన్నీ ప్రాణులే
వేదన వేదము తెలియనిది లోకములోని గ్రుడ్డి జీవులే
వేమన పద్యములు చదివితే తెలియును అన్నీ సత్యాలే-
ఒకప్పుడు టచ్ స్క్రీన్ మీద పరుగులు పెట్టిన వేళ్ళు ...
ఎటువైపు నుండి వ్రాసినా అన్నీ పొందికైన పదాలే...
ఎంతసేపు వ్రాసినా ఏ మాత్రం అలుపు రానేలేదు...
ఎందుకో ఏమో! ఆగెను అవి నేడు ఎందుకో ఏమో!...
-
అందరికీ నూతన ఆంగ్ల సంవత్సరం2022 శుభాకాంక్షలు
New English year 2022 wishes to all
💐💐💐💐-
నిదురపోకు నేస్తం! మేలుకో!... క"వి"తకోసం
కనులచాటున కలలు...అవి నీకేగా సొంతం!
అక్షర జ్వాలలతో వెయ్ దేహానికి చలిమంటలు
పదాల వరుసలతో సాగించుము నీ పయనం.
...✍️శ్రీ రవీంద్ర నందుల-
ఈ రోజు "ఖర్మ జన్మ" గ్రహీత శ్రీ రవీంద్ర నందుల
శరీరం పుట్టినరోజు
💐💐💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹-
నిన్న...నేడు..రేపు
--------------------------------
నిన్న నేటికి గతము.గడచిపోయింది.విచారించి లాభంలేదు.
నేడు వ్యక్తమానము.ఏదో జరుగుతుంది.జరిగిపోతూ ఉంది.
నిన్న జరిగిన నష్టం నేడు కూడా జరిగితే చింతించటం తప్ప
ఏమి చేయగలం?. ఊహూ... అలా ఏమి కాదులే! రేపు అనేది కూడా ఒకటి మిగిలే ఉందిలే.కాని భవిష్యత్ అంధకారమయం ఏమౌతుందో తెలియదు కదా మరి!ఏదేమైనా కాస్తమంచి జరుగుతుందన్న ఆశ మనలో కొంతైనా ఉంటే చాలు.-
"నాన్న" ఓ కొత్త పరిచయం:
--------------------------------------
నాన్న ఓ అకార సంధి
ఆకారం లేని నాకు
నాన్న ఒక నేస్తం
తోడులేని నాకు
నాన్న ఒక అనుభూతి
అనుభవం లేని నాకు
నాన్న ఓ సారథి
సారథ్యం తెలియని నాకు
నాన్న ఓ రాజమార్గం
దారితెలియని నాకు
నాన్న ఓ గమ్యం
గమ్యం తెలియని నాకు
నాన్న ఓ స్ఫూర్తి
ఆర్తి కలిగిన నాకు
నాన్న ఓ గొప్ప గ్రంథము
శ్రధ్ధ కలిగిన నాకు
...✍️సింధూశ్రీ రవీంద్ర నందుల-
ఎగిసిపడే కెరటాలు లెమ్మంటూ మదిని తట్టిలేపేనూ
క్రిందపడిన ప్రతిసారి పైకి లెమ్మంటూ చేసి చూపేనూ
అందని ఆ తీరం కోసం ఆపుకోదు
ఆ సంద్రమెపుడు తన ఆరాటం
అలలరూపమున ఆశయమ్ము కలిగి
ఉవ్వెత్తున ఎగిసెగిసి తీరం తాకేనూ
...✒శ్రీ రవీంద్ర నందుల-
ఓ నా ప్రియ మిత్రమా! కుశలమా!!
నీ తలంపులే నా తలను నిండెనూ
నీ సుమధుర పిలుపులు ఎపుడంటూ
నీ నయనాల చూపులు కావాలంటూ!!!
...✒సింధూశ్రీ రవీంద్ర నందుల
-