అన్వేషిస్తున్నా...
నిజం పలికే గొంతుక వినిపిస్తుందేమోనని....
వెతుకుతున్నా...
మచ్చలేని మనసేమైనా కనిపిస్తుందేమోనని..
కాచుకున్నా..
మంచి తెల్లకాగితం దొరుకుతుందేమోనని
కాసిన్ని అక్షరాలు ఒలకబోయడానికి..!
-
Mother's day special vedio by sabareesh
https://youtu.be/pjpG82-Gnzw
మాతృదినోత్సవ శుభా... read more
సమయమేదనుకుని
సమస్యగా మిగిలిపోకు
సందర్భమేదైనా సదా సాగిపో...
సామరస్యమే జీవన సౌరభం...
సంకల్పమే మేథకు ఆయుధం...
మానవీయతే మనిషికి మరో చరితం..!
-
కాంతి రేఖల్లో
భ్రాంతి తొలగించే
క్రాంతివై వెలుగు
శాంతి పంచే చిరునవ్వుల
ప్రశాంతివై మెలగు...!
-
జీవితం చిన్నదే
జీవించేంత...
జనన మరణాల పట్టికలో
జత చేసేంత...
అస్పష్టంగా తెలియని
రణగొణ ధ్వనుల మధ్య
తేలియాడేంత..
ఆశావహ దృక్పథంతో
ఆకాంక్షలను నెరవేర్చుకునేంత..
కలలు కనేంత
కలలు సాకారం చేసుకునేంత..
కన్నీటి కష్టం విలువ తెలుసుకునేంత
జీవితం గొప్పదే...
బ్రతికినంత కాలం...!-
నువ్వు బాగున్నప్పుడే
నలుగురినీ పలుకరించు..
ఆ నలుగురు నీతో
వెనుకో ముందో నడవాలంటే...!-
ఒక్క మాటే చాలదా
అమ్మ మాటగా అనురాగాన్ని పంచ
ఒక్క పదమే చాలదా
అమ్మ భాషగా ఆప్యాయత పంచ
ఒక్క తీగలో పరిమళాలు ఎన్నో
మాతృభాషను పంచ..!
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు
🙏🙏🙏-
వ్రాయలేని అక్షరమేది...
కానరాని కవనమేది...
పద బంధానికి పునాది
భావంలో బంధీ..
ప్రతీకలో ప్రత్యామ్నాయం..
తలపులో మెరుపు..
మైమరపించే పిలుపు...
ఝళిపించే రుధిరం..
కదిలించే కరుణ..
కవ్వించే పాశం..
కలంలో
ఒదిగి
ఎదిగేది
కవిత్వం ..!-
నిలకడ లేని దందాలో...
నీకు నాకు వాటాలెందుకు...
ముప్పేట దాడిలో(పన్నులు)
మునిగిపోయే వారసులం మనం..!
-
చిత్తడి జీవితంలో
చిత్రాలెన్నో...
చిత్తమై చేసేవన్నీ
విచిత్రమై తేలుతున్నవి...!
-