అందరితో కొట్టినట్లు మాట్లాడలేము!
అలా అని ప్రేమగాను మాట్లాడలేము!!
ఎంతవరకో అంతే మాట్లాడుతాం.....
కానీ మన అనుకున్న వాళ్ళతో
ఎలా అయినా మాట్లాడగలం!
మన అనుకున్నాం కాబట్టే మాట్లాడగలం!!
మన అనుకున్నాం కాబట్టే ఒక మాట అనగలం.
వాళ్ళు మన అనుకుంటే పట్టించుకోరు!
పరాయి అనుకుంటే పట్టి పట్టి చూస్తారు!!
...✍️వెన్నెల సీత-
Cry on 2 december
కొన్ని పరిచయాలు
గతం చేసిన గాయాలను
మాన్పుతాయి!
మరికొన్ని పరిచయాలు
గతం చేసిన గాయాలను
మళ్ళీ రేపుతాయి!!
...✍️వెన్నెల సీత-
విలువ తెలిసినవారి చేతిలో పడిన రాయి
గుళ్ళో దైవం అవుతుంది.
తెలియని వారి చేతిలో పడిన రాయి
ఇంకొకరికి గాయం చేసే వస్తువు అవుతుంది.
నువ్వు కూడా అంతే!!
జీవితంలో నువ్వు ఎంచుకున్న
వ్యక్తిని బట్టి నీ విలువ మారుతుంది.
...✍️వెన్నెల సీత-
Where there is love
there will be anger.
But some people
don't understand.
...✍️vennela sita-
ఓయ్ అబ్బాయ్...
చేసుకున్న చాటింగ్ లు
అనుకున్న మాటలు
రాసుకున్న అక్షరాలు
దాచుకున్న జ్ఞాపకాలు
జారిన కన్నీళ్ళ చారలు
తప్ప ఇన్నాళ్ళ
మన ప్రేమాయణంలో
ఏమ్ మిగలలేదు.
వీటి కోసం ఇన్నాళ్ళ కష్టం
ఏంటో తెలుసా!?
నా జీవితం!!
వెళ్ళిపోయి నువ్వు బాగున్నావు!
వెళ్ళలేక నీ జ్ఞాపకాల్లో నేనున్నా!!
...✍️వెన్నెల సీత-
ప్రేమ అనే చెట్టుకి..,,
నమ్మకం అనే ఎరువు వేయలేనప్పుడు,
క్షమాగుణం అనే నీరు పోయలేనప్పుడు,
అర్ధచేసుకోవడం అనే పోషణ చేయలేనప్పుడు,
జీవితం అనే పంటను ఆశించడానికి అర్హుడవు కాదు.
...✍️వెన్నెల సీత-
ఓయ్ అమ్మాయ్...
"కోరిక" పుట్టినప్పుడు
"పక్కలో" ఉండేవాణ్ణి కాదు..,,
"కొరివి" పెట్టేవరకు
"పక్కన" ఉండేవాణ్ణి కోరుకో!!
...✍️వెన్నెల సీత
-
నా గురించి మీరు విన్నదంతా
నమ్మేయండి.
ఎందుకంటే నిరూపించడానికి
నాకు సమయం లేదు.
కావాలంటే ఇంకొంచెం జోడించుకోండి.
...✍️వెన్నెల సీత-