నిన్నటి నిజాలే బాగున్నాయి
ఇవాల్టి అనుభవాలకంటే
కానీ రేపటి సహాయం కావాల్సిందే
ఇవాల్టి అనుభవం అర్థమవ్వాలంటే-
గతం తో ప్రస్తుతాన్ని పోల్చుకుంటూ
జీవితం లో ఎక్కువ ప్రయాణించలేము
పరిస్థితులు ప్రభావితం చేస్తాయి
తాపత్రయాలు గమ్యాన్ని మారుస్తాయి
భయాలు గమనాన్ని నిరోధిస్తాయి
కారణాలు కలలని చదరగొడతాయి
--------------------------------------------
-
అతని పైన అతనికి వ్యామోహం పెరిగితే అహంకార పూరితుడు అవుతాడు. మరొకరి పై వ్యామోహం పెరిగితే వెఱ్ఱి వాడు అవుతాడు. భగవంతుడి పైన లేదా దేశం పైన వ్యామోహం పెరిగితే భక్తుడు/దేశభక్తుడు అవుతాడు.
-
"నూటికి తొంభై శాతం జీవితాన్ని నడిపించేవి సందర్భాలు, పది శాతం అద్భుతాలు. మనోభావాలు కూడా నడిపిస్తాయి అని అని మనం అనుకుంటాం అది నామమాత్రమే"
-
"మనం పడే కష్టాన్ని అయినా సుఖాన్ని అయినా అలలు ఢీ కొట్టినా నిశబ్దంగా, గౌరవంగా భరించి నిలబడ్డ దీపస్తంభం లాంటి మనస్తత్వం అలవాటు అయితే ఎటువంటి సందర్భాన్ని అయినా ఎదుర్కోగలం"
-
ఆలోచించకుండా ఏ పనినీ చెయ్యకూడదు! ఒక్కసారి అలా చేసామా, ఆ తరవాత వచ్చే సమస్యలను ఎదుర్కోవాల్సివస్తుంది•
"ఆలోచించి చేసే పనికి అనుకున్న ఫలితాలు దక్కుతాయి."-
తలకు మించిన అప్పు
మంచిని చెడు చేస్తుంది
ఆనందాన్ని విషం చేస్తుంది
మనిషిని మట్టిగడ్డ చేస్తుంది
అప్పు చెయ్యి..
ఎంత మేర అవసరమో అంతే!
అనుకున్న సమయానికి తీరుస్తానన్న భాధ్యత ఉందే; అదే అర్హత
-