కోదండ రాముని కొల్చు భాగ్యమ్ము చాలు
ఇంతకన్న నేమి విభవమ్ము వలయు నాకు
ఈ దేహమ్ము మనదు నడిపించు గేహమ్ము
దుర్వ్యసనమ్ములతో శైథిల్యమొనర్ప రాదు
మనసు దేవుని దేవళమ్మని భావింపగావలె
మన మదినెల్లప్పుడు శుద్ధిగా నుంచుకోవలె
బ్రతుకు కాదు నిత్యం తెలియాలిది సత్యం
కర్మఫలమ్మె మనవెంట వచ్చుటన్నది తథ్యం
పాప పుణ్యమ్ములనెఱిగి సాగించు బ్రదిమి
పరమపథముఁ జేరి పరమాత్మలో కలవాలి
-
కడుపు కన్నము లేక క్షుద్బాధతో యలమటించు
వాడొకడు పంచభక్ష్యాలతో జిహ్వచాపల్యమున
ణచుకొని యజీర్తి రోగియై బాధనొందువాడొకడు
చేత చిల్లిగవ్వలేకొకండు తరగని సిరితో నొక్కడు
ఇదియేమి సృష్టి కైవడి
పొదలించితి వయ్య యీశ? పూర్ణుడవే నీ
వు? దయాం బోధివి కాదే
మి? ధర్మమే? నీకిది యొనరింపం దగునే?-
భక్త జనులారా
భక్తితో సేవించరె
భగవంతుని
శ్రద్ధతో పూజింపరె
పురుషోత్తముని
మదిలో చింతించరె
మధుసూదనుని
కలలో పలవరించరె
పరమాత్ముని
ఇలలో అర్చించరె
అనంతుని
పొందగసాధన చేయరె
సాయుజ్యాన్ని
వైరాగ్యముతో చేపట్టరె
పరమపథాన్ని
జీవిత లక్ష్యం చేరరె
వైకుంఠసదనాన్ని
-
ఎగసిపడకు
పడిపోగలవ్ పాతాళానికి
అణకువ వినయమ్ములే మెరుగు
అవె జీవిత సార్థకతకు
వరాలు
-
పేలకండి
అవాకులు చవాకులు
మనమంతా మనుషులం
కాదు మానవ మృగాలం
వివేకించండి-
సచివాలయంలో
సందడే సందడి
సచివులందరి ముఖంలో
సంతోషహేళ
కళావిహీనం
వైసీపీల ఆననం
ప్రతిపక్ష స్థానం
కరువైన వైనం
-
లేడే..?!
అంతటా దైవం!?
కాదు కల్పన!!
కాదే !?..అవగాహన !!
వివేకించరే..!?-
1)సాగదు
దుష్ట పాలన
దురిత చర్యలు
దుర్మతుల చేష్టలు
పెల్లగిల్లు
2)నిల్చును
సుపరిపాలన
సన్మతుల చింతన
జనుల హితము
కలకాలం-
నా మస్తిష్కంలో వెలుగుతోంది
ఆరిపోని కవన జ్యోతి
సంఘమందు జనుల మెదళ్ళు
చైతన్య పథంలో నడిపేందుకు
హెచ్చుతగ్గుల కులభావన సమసేందుకు
మతవైషమ్యం తొలగేందుకు
అజ్ఞానపు జనులపైన
మౌఢ్యమనే మత్తుజల్లి
మోసం దగాలు జేసే
దుష్టుల మాయలు అరికట్టేందుకు
భావి భారత పౌరులైన నేటియువతరం
మనోనిర్భర్త్సత లేకపోవగ
వ్యసనాలకు లొంగిపోయి
జీవితాలను అస్తవ్యస్తం చేసుకోకుండా
అవగాహన కల్పించేందుకు
సర్వజన హితం కోరి
జాగృతం చేసేందుకు
సాగును నాగంటం
నాలో సత్తువున్న వరకు
-
వాయించెదవు వేణువు
మృదు గాన రవళి చెవి సోకగా
మదిలో ఏదో గిలిగింత కలుగగా
మురళీధరా మురిపాలదొరా
నీకై వేచేను ఈ చెలి నను లాలింపరా
నీ చూపు తగిలి నా బుగ్గలు కందెరా
నీ వలపు కౌగిలిలో నే పులకింతురా
ఈ వనిత నీదేనుర నను వరించరా
నీ బాహు బంధాలలో నను తేలించరా
నీ వెచ్చని తనువు నా చేలమయ్యెరా
వరాసనా నీ కైదండ నాకండగా నిలుపరా
ఓ మాధవా నా ధవుడవు నీవేనురా
వినరా నా మొరా రావేలరా ఓ ఇందీవరా
-