ఆయన సభలో:
"ఆడది లేనిదే మగాడు లేడు... ఆమె తరువాతే అతను... "
ఇంటికి వెళ్ళాక: "ఒసేయ్, ఏదీ చేతకాదు నీకు... ఎందులోనైనా దూకి చావు... "
ఆమె వర్షన్ లో...
సభలో: "ఓపికలో మాకెవరూ సాటిరారు... సహనం మా ఆభరణం... "
ఇంటికి వెళ్ళాక: బాబు ఏడుస్తున్నా కూడా తన మేకప్పు, తన రీల్సు, వ్లాగ్స్ చేస్తూ బాబుని లెక్కచేయనితనం...-
బిస్మిల్లాహిర్రహ్మాన్ నిర్రహీమ్
Praise the Lord...
Fb: Vennela Satish
Fb pa... read more
ఎందుకంత ఉరుకులాట
దేనికిన్ని మెరుపులట...
రంగులేసి మాయచేసి
నిన్ను నువ్వు పొగుడుకుంటు
ఇంత నీచ జన్మంబున
ఉద్దరించేదెవరినట...
కట్టె కాలక మానదు
కాయం పోక ఆగదు
ఖర్మ వెంటాడక తప్పదు...
వెన్నెల సతీష్...
-
ఆమెను అర్థం చేసుకోనివారికి
ఆమెను అడ్డుకునే హక్కు కూడా ఉండదు...
-
వాళ్ళు వీళ్ళు అనుకుంటారని
ఇలాగే బ్రతకాలేమో అని
ఓ గిరిగీసుకుని ఉంటూ,
మనవికాని పరాయి బ్రతుకులు బ్రతుకుతూ
ఇదే జీవితం అనుకుంటున్నారంతా...
అన్నీ అద్దె బ్రతుకులే ఈ లోకంలో...
వెన్నెల సతీష్...-
అంతా ముగిసిందని ఓసారి,
లేదూ ఇంకెంతో మిగిలుందని మరోసారి...
ఈ అంతర్యుద్ధమెప్పుడు ముగిసేనో...
వెన్నెల సతీష్...-
ఒక చిన్న అనుమానం ఆ సీతని
అగ్ని గుండంలోకి నెట్టేసిందే,
మరి ఈ లోకులు నన్ను ఎన్నో అంటున్నా
నాపై నీకున్న ప్రేమని రోజురోజుకూ
అంతలా ఎలా పెంచుకుంటున్నావ్ సీతా...
ఈ జన్మలో నీ ప్రేమను పొందలేకపోయినా
మళ్ళీపుడతా రాముడిగా, ఈ సీత ప్రేమకై...
వెన్నెల సతీష్...-
హద్దులులేనిది మన ప్రేమ,అంతం లేనిది మన ప్రేమ...
చరిత్రకు సాక్ష్యం మన ప్రేమ,చెరిగిపోని బంధమే మన ప్రేమ...
ఆ సీతారాములకు చెబుదాం
మా ప్రేమను ఎవరూ విడదీయలేరంటూ,
ఇకపై వనవాసాలు, అగ్ని ప్రవేశాలు ఉండబోవంటూ...
వెన్నెల సతీష్...
-
నాటకాల జగత్తులో పావుని నేను
ఆడుకుని వదిలేసిన ఓ బొమ్మని నేను...
తెల్లనివన్నీ పాలని, నల్లనివన్నీ నీళ్ళని
నమ్ముతూ స్వార్థలోకంలో నలుగుతూ
బ్రతికేసానిలా ఇన్నాళ్ళూ
నమ్మకమనే మాటను నమ్మి...
వెన్నెల సతీష్...
-
చిటపట చినుకుల్లో చిందులు కొందరివి...
చిల్లులు పడిన గూటిలో చితికిపోయే బ్రతుకులు కొందరివి...
వెన్నెల సతీష్...
-