QUOTES ON #త్యాగం

#త్యాగం quotes

Trending | Latest
13 APR 2021 AT 0:24

అతను ఆమె ఓ ప్రేమ కథ
ఆమెను పల్లకిలో కూర్చోపెట్టారు
అతనిని పాడిపై పడుకోపెట్టారు
ఆమెను పూలతో అలంకరించారు
అతనిపై పూలను పరిచారు
ఆమెను నలుగురితో కూర్చోపెట్టారు
అతనిని నలుగురు మోసుకెళ్ళారు
ఆమెది కొత్త జీవితానికి తీసుకువెళ్తుతారు
అతనిని ఆఖరి మజిలీ మోసుకువెళ్తున్నారు
ఆమె కోసం ఆనంద కేరింతలు
అతని కోసం గుండెలదిరే రోదనలు
ఆమె కోసం పురోహితుల మంత్రాలు
అతని కోసం కాటికాపరి నిష కబుర్లు
ఆమెకి అక్షింతాల ఆశీర్వాదాలు
అతనికి అశ్రునయనాల వీడ్కోలు
ఆమెది బంధాలు కలుపుకునేందుకు తొలి ప్రయాణం
అతనిది బంధాలు తెంపుకొనేందుకు ఆఖరి ప్రయాణం
ఆమెది నూతన జీవితం కోసం పయనం
అతనిది ఆమె కోసం అంతమ్మైయే గమనం..!!!

-


17 AUG 2017 AT 15:08

Just check once, before sacrificing your life for someone...

Do they deserve your sacrifice?


ప్రాణత్యాగం చాలా విలువైనది, కానీ
ఆ ప్రాణత్యాగం ఎవరి కోసం, ఎందుకు అనేది కూడా ఆలోచించతగినది..🤘

-


25 JUL 2020 AT 12:42

బాధైనా గుండెల్లో దాచేదే అమ్మంటే
భారమైన కడుపులోన మోసేదే అమ్మంటే


పొత్తిల్లో కదలికలే అదృష్టమని బావిస్తూ
తన్నుతున్న తనివితీర మురిసేదే అమ్మంటే


సొమ్మసిల్లి రక్తసంద్రములో తడిసి ముద్దైనా
పేగుతెంచి ప్రేమెంతో పంచేదే అమ్మంటే


పునర్జన్మ తనకైనా పురిటినొప్పులు సహిస్తూ
స్వేదపు సుడిగుండంలో నవ్వేదే అమ్మంటే


అమ్మప్రేమ వర్ణించ అక్షరాలుచాలవు వనజా
తనువుచీల్చి త్యాగాలని చేసేదే అమ్మంటే

-


31 MAY 2021 AT 19:35

ఎన్నెన్నో త్యాగాలకు నెలవు
ఈ బంధాల కొలువు..

-


12 SEP 2020 AT 19:45

నీ పాదాల తప్పటడుగులు మా గుండెకు పలకరింపు ...
అమ్మా నాన్నల కు కంటికివెలుగు...


నీ కోసం విశ్వాన్ని బంతిలా చుట్టి ఇవ్వాలని ఆడించాలని నాకోరిక నీ ఆటల్లోనే నా ఆనందం నాన్నను కదా నీ నాన్నను కదా ....

సప్త సముద్రాలను చిలికైనా అమృతమే తీయాలని నీ దాహం తీర్చాలని విశ్వానికి బలమైన బిడ్డను అందించాలని తపనే నాది కదా అమ్మను కదా మీ అమ్మను కదా.‌....

-


30 MAY 2017 AT 0:54

పేగు బంధపు స్వార్థంతో
అమ్మ చేసే "త్యాగాలే" గొప్పవనుకుంటాం మేము,

కానీ,

ఎండకు ఎండుతూ,
వానకు నానుతూ,
చలికి వణుకుతూ,
ఆత్మీయులకి దూరంగా ఉంటూ,

నీ ప్రాణాలకంటే మా ప్రాణాలూ,
నీ ఆనందం కంటే మా ఆనందమే ముఖ్యమనుకుని బ్రతుకుతున్న,

ఓ...
సరిహద్దులో సైనికుడా,
నీ "త్యాగాన్ని" ఏమని పొగడగలం🙏🙏🇮🇳




-



వదులుకొని వెళ్ళడానికి
వదిలించుకొని వెళ్ళడానికి
చాలా తేడా ఉంది.
మొదటి దానిలో త్యాగం ఉంటే..
రెండవ దానిలో అవసరం ఉంటుంది.

-


28 MAY 2019 AT 19:44

Sacrifice ;


One of the best thing
what you can
do to others from your side

Literally,
a feel good experience ,
can feel only when you experience it.

-


1 MAY 2021 AT 12:24

నుదుటన చిమ్మే చెమట
చుక్కలు అగ్గై మండగలవని...
మానవ శ్రమను గౌరవించమని
గర్జించే క్షణాలు వున్నవని..
మొరటుగా వుండే చేతులకూ
గాయాలన్నవి నిత్యమని...
పిడికిళ్ళ బలంతో దౌర్జన్యాన్ని
అణిచే రోజోకటున్నదని...
స్వేచ్ఛగా పీల్చే ఊపిరి కోసం
త్యాగాలన్నవి తధ్యమని..
ఆకాంక్షించిన బ్రతుకుల కోసం
పోరు బాటలు తప్పవని..
రుజువు చేసిన రోజు ఇది.
నిప్పై ఎగసిన స్పూర్తి ఇది.

-


30 MAY 2017 AT 6:30

చిన్నప్పుడు కొవ్వొత్తి వెలుతురులో చదువుకుంటున్నప్పుడు
త్యాగం అంటే ఏంటమ్మా..! అని అడిగినప్పుడు..
అమ్మ చెప్పిన మాటలు....

"తను నిండా కరుగుతూ కూడా నలుగురికి వెలుగునిచ్చే కొవ్వొత్తి చేసే దాన్నే త్యాగం అంటారు".

అప్పుడు నాకు అర్ధం కాలేదు...

ఇంటిల్లిపాది సంతోషం కోసం తన ఇష్టాయిష్టాలను
వదిలేసి జీవించే ఇల్లాలు...

బిడ్డ ఆకలే తన ఆకలిగా, బిడ్డ సంతోషమే తన
సంతోషంగా బ్రతికేసే తల్లి...

ప్రాణాలను సైతం పణంగా పెట్టి, ప్రజలను కాపాడటం కోసం
సరిహద్దులో కాపలా కాసే సైనికుడు...

వీళ్ళను చూస్తే అర్ధమవుతోంది..
అప్పుడు అమ్మ చెప్పిన మాటల్లోని అంతరార్థం...

-