నీ జీవితంలో
బెస్ట్ మూమెంట్ ఏదీ అంటే
ఒకటో, రెండో అని వెతుక్కోకుండా
ఒక పెద్ద లిస్ట్ చెప్పేలాగా జీవించు.🤘-
|
|
◆ Thanks for your attention here.😍💐
◆ 8+ Years of YQ journey..😇🖋️✌️
◆ Bless /... read more
ఎవరి గురించి వారు చదువుకుంటారో లేదో కానీ
ఎదుటి వారి జీవితం మీద మాత్రం PhD చేస్తుంటారు
ఎవరికి ఏం చెప్పకు, వాళ్ళు PhD చేస్తున్నారు ఆల్రెడీ.🤘-
కష్టపడి పైకి వచ్చిన వాళ్ళని చూసి
చాలా గ్రేట్ అని చప్పట్లు కొడుతుంటాం
స్టోరీలను స్టేటస్ గా పెట్టుకుంటాము కదా
ఏదో సాధించాలని కష్టపడి పనిచేస్తున్నటువంటి
చుట్టాలని / దోస్తులని/ పరిచయస్తులని మాత్రం ప్రోత్సహించం
ఎందుకు అలా అని అడుగుతున్నావంటే అదృష్టమే నీది.🤘-
ఓటమితో నలిగిపోతున్న మనసుకి
గెలిస్తే బాగుంటదనే విషయం తెలియదంటావా!
పేదరికంలో మగ్గిపోతున్న బతుకులకి
ధనం సంపాదిస్తే దర్జాగా జీవించొచ్చనే ఎరుక లేదంటావా!
ఎలా గెలవాలో నేర్పించు, ఎలా సంపాదించాలో వివరించు.🤘-
ఇంత వయసొచ్చాక కూడా
ఏ మనిషి ఎలాంటోడు అనేది తెలుసుకోలేదంటే
నీకు ఇంకా జీవితపు పాఠాలు ఒంట బట్టినట్లు లేవు.🤘-
పైసలు ప్రతీ మనిషి ప్రవర్తనని మార్చవు
పైసలకి మాత్రమే విలువిచ్చే కొందరి ప్రవర్తననే మారుస్తాయి.🤘-
అందరూ online లో బిజీ ఉన్నారా
నీ offline జీవితం గురించి నువ్వే పట్టించుకో మరి.🤘-
ఒక సంస్థని సృష్టించాలన్నా
ఒక సామ్రాజ్యం నిర్మించాలన్నా
నువ్వు నమ్మే ఒక దళం ఉండాలి
నిన్ను గెలిపించే ఒక సైన్యం ఉండాలి.🤘-
నువ్వెలాగైనా బతుకు
కొందరికి నువ్వు నచ్చవు
కొందరికి నువ్వు నచ్చుతావు
ఎవరేం అనుకుంటారోనని
అమ్మ పురిటి నొప్పులు భరించలేదు.🤘
(Love Yourself and Live Your Life)-
చేతల్లో తెగువ
గుండెల్లో ధైర్యం
మెదడులో తెలివి
ఆచరణలో పట్టుదల ఎంతున్నా పర్వాలేదు
నీ నరనరాల్లోని అహం, అహంకారం నీకున్న వాటిని నాశనం చేయొద్దు.🤘-