Vanaja Tinny   (✍️✍️❤️బుజ్జి ❤️✍️✍️)
306 Followers · 82 Following

read more
Joined 12 February 2019


read more
Joined 12 February 2019
2 MAY AT 14:26

ఉలిదెబ్బల నొప్పులనే ఓర్చుకుంది తన గెలుపే
అణగారిన తలరాతను మార్చుకుంది తన గెలుపే

అంబేద్కర్ ఆలోచన వారసుడై ఉద్భవించి
పేదరికపు సంకెళ్ళను తెంచుకుంది తన గెలుపే

అభివృద్ధికి నోచుకోని అడవితల్లి ఒడిలోనా
అక్షరమే ఆయుధంగ మలుచుకుంది తన గెలుపే

మట్టిజాతి మనుగడకే జాడలేని జీవితాన
సమాజాన విలువెంతో పెంచుకుంది తన గెలుపే

అదుముకున్న అజ్ఞానపు తిమిరాలను తరిమెందుకు
చదువుపంచు మార్గాన్నే ఎంచుకుంది తన గెలుపే

వనజలాంటి అభిమానులు తారసపడు అడుగడుగున
అన్నలాగ అనురాగం పంచుకుంది తన గెలుపే

-


12 APR AT 16:35

అజ్ఞానపు తిమిరాలను చీల్చేదే చదువంటే...
విజ్ఞానపు శిఖరాలకు చేర్చేదే చదువంటే....

కులమతాల హేళనతో అంటరాని బానిసగా...
బంధించిన సంకెళ్ళను తెంచేదే చదువంటే...

ఆడపిల్ల నీవంటూ , చదువునీకు తగదంటూ....
అడ్డుకున్న అగ్రకులను మార్చేదే చదువంటే....

ధనిక పేద భేదమేల, మనజాతే ఒకటైతే....
సక్కనైన సంస్కారం నేర్పేదే చదువంటే...

చిదిమేసిన ఆశయాల చిగురింపే వనజైతే......
ఊహలనే మేడలుగా కూర్చేదే చదువంటే

-


11 APR AT 18:58

మరువలేని అనుభూతులు కల్గిస్తుంది పల్లెటూరు
గుండెనిండ గుర్తులతో నింపిస్తుంది పల్లెటూరు

అవ్వతాత కథలెన్నో చిన్ననాటి ప్రాయంలో
మంచీచెడు సారమంత నేర్పిస్తుంది పల్లెటూరు

ఇరుగుపొరుగు మమకారం ఎదురింట్లో అభిమానం
ఎదలోతున బాదలన్ని మరిపిస్తుంది పల్లెటూరు

అక్కచెల్లి అన్నతమ్మి అత్తమామ అంటుంటే
అంతులేని ఆప్యాయత చూపిస్తుంది పల్లెటూరు

వనజమదిని మురిపించే పలకరింపులెన్నెన్నో
మరచిపోని బంధాలను అందిస్తుంది పల్లెటూరు

-


11 APR AT 12:44

ఉషోదయపు అరుణ కిరణాల
తోలి వెలుగుల ఉల్లాసం తాను

సాయంకాలపు సంధ్యా కిరణాల
తుది వెలుగుల ఉత్సాహం తాను

కాలమెంతగ పరుగుల పెట్టినా
అలుపెరుగని ఆదిశక్తి తాను

భాద్యతలెంతగ బలహీన పెట్టినా
ఓరిమి వదలని ధరణి తాను

గమ్యమెంతగ గాబర పెట్టినా
గమనం ఆపని గార్గి తాను

వివక్షేంతగ దూరం పెట్టినా
తలబడి నిలబడిన విజయం తాను

-


10 APR AT 14:59

కష్టమైన గమ్యాలను చేరగలను తానుంటే...
అత్యున్నత శిఖరాలను తాకగలను తానుంటే...

నిక్కమైన స్నేహానికి ఆయువైన ఆశతాను....
కాదేదీ అసాధ్యం చేయగలను తానుంటే....

నిస్వార్థపు నేస్తానికి ఉత్తేజపు ఊసు తాను.....
గతంలోని గాయాలను మాన్పగలను తానుంటే....

అర్థవంత ఆప్తుడికి అసలుసిసలు రూపు తాను....
ఉదయించే కిరణాన్నై మెరవగలను తానుంటే......

అంబేద్కర్ ఆలోచన వారసులే వనజా తను......
అజ్ఞానపు తిమిరాలను తరమగలను తానుంటే.....

-


9 APR AT 13:20

బంధించిన బ్రహ్మరాత మార్చడమే గెలుపంటే.....
అడ్డుకున్న నుదుటిరాత చెర్పడమే గెలుపంటే......

శిఖరాలను చేరుటకై విహరించే వేళల్లో......
విరిచేసిన రెక్కలతో ఎగరడమే గెలుపంటే.....

ఆడపిల్ల నీవంటూ అణిగిమణిగి ఉండమంటు.....
నిందించిన నలుగురిలో నిలవడమే గెలుపంటే......

సదువులేక విలువలేక రోధించిన గోడల్లో......
ఉదయించిన తేజస్సై మెరవడమే గెలుపంటే.......

కమ్ముకున్న కారుమబ్బు దాచలేదు వనజనసలు
అజ్ఞానపు తిమిరాలను చీల్చడమే గెలుపంటే......

❤️ వనజ ❤️

-


8 APR AT 19:11

కదులుతున్న కాలాన్ని సవాలు చేస్తూ......
ఎంచుకున్న గమ్యానికై ఉరకలు వేస్తూ......
పడుతూ లేస్తూ పడి లేచి పరుగులు తీస్తూ......
భయపెట్టే ఆటంకాలన్నీ పాతాళానికి తొక్కేస్తూ...
సాగిపో నేస్తమా నీ గమ్య శిఖరాన్ని చేరుకో నేస్తమా...


అలసి సొలసిన నాయనాలకు విశ్రాంతి నిస్తూ......
దినదినం పెరిగే శారీరక శ్రమకై దేహాన్ని సిద్ధం చేస్తూ....
వెనుదిరగని మొండితనం తో ముందడుగు వేస్తూ.....
తలవంచిన చోటే నెగ్గెందుకై పిడికిలి బిగిస్తూ.......
సాగిపో నేస్తమా నీ గమ్య శిఖరాన్ని చేరుకో నేస్తమా.....


గుర్తొచ్చిన బంధాలకై చిరునవ్వులు చిందిస్తూ.......
చెమటోడ్చిన దేహనికి సత్తువ నిస్తూ.......
గగనం చేరే గమనం లో గాయాలను దాచేస్తూ.......
సుడిగుండపు అలలైన కాలికింద నలిపేస్తూ.......
సాగిపో నేస్తమా నీ గమ్య శిఖరాన్ని చేరుకో నేస్తమా....

-


16 NOV 2020 AT 21:32

నీ మౌన రాగాల పల్లవుల్లో
ఉదయించే ప్రేమ తేజోకిరణం నేను

నీ వాలు చూపుల హొయలల్లో
పులకరించే ప్రేమ తపస్విని నేను

నీ మృదు మాటల అలలల్లో
పరవశించే ప్రేమ కావ్యమంజరి నేను

నీ చిరు కోపాల తాపాలల్లో
చిరురించే ప్రేమ పుష్పాంజలి నేను

నీ బిగి కౌగిలి స్వప్నాలల్లో
ప్రజ్వలించే ప్రేమ అమృతాక్షరి నేను

-


15 NOV 2020 AT 17:14

నా మది ముంగిట్లో చిగురించిన
అమృత ప్రేమ కావ్యం నువ్వు

నా ఎద వాకిట్లో విరబోసిన
అరుదైన స్వర్ణ కమలం నువ్వు

నా గుండె లోతుల్లో వికసించిన
అమర ప్రేమ పుష్పం నువ్వు

నా హృదయ కోవెల్లో కొలువున్న
అద్భుత మనోహర రూపం నువ్వు

-


25 JUL 2020 AT 12:42

బాధైనా గుండెల్లో దాచేదే అమ్మంటే
భారమైన కడుపులోన మోసేదే అమ్మంటే


పొత్తిల్లో కదలికలే అదృష్టమని బావిస్తూ
తన్నుతున్న తనివితీర మురిసేదే అమ్మంటే


సొమ్మసిల్లి రక్తసంద్రములో తడిసి ముద్దైనా
పేగుతెంచి ప్రేమెంతో పంచేదే అమ్మంటే


పునర్జన్మ తనకైనా పురిటినొప్పులు సహిస్తూ
స్వేదపు సుడిగుండంలో నవ్వేదే అమ్మంటే


అమ్మప్రేమ వర్ణించ అక్షరాలుచాలవు వనజా
తనువుచీల్చి త్యాగాలని చేసేదే అమ్మంటే

-


Fetching Vanaja Tinny Quotes