నువ్వు దూరమైన క్షణాన.
Kimulla-
మతసామరస్యం
మత సామరస్యపు మతలబే మారిది
కలిసి బతికే ఆలోచనలకే చెదపురుగే ముట్టింది...
ఇది లౌకిక దేశమనే ఆలోచనే తొలగింది
కలిసి తిన్న ఇఫ్తార్ విందులు
సామూహికంగా పంచుకున్న జమ్మి బంగారాలు...
కలెగలిపి తీసుకున్న క్రిస్మస్ బహుమానాలు...
చిన్నబోయి చూస్తుండి పోయాయి...
మతం ఏదైనా కానీ మనిషన్న మాటే మరిచారు
రాజకీయ రంగులే పులుముకున్నారు
అధికార దాహంతో రంకెలేస్తున్నారు
ఇది తీరని దాహం తొలగని తాపం.
మనిషిని మనిషిగా చూడలేని
మాడ్చుకుని ఉన్న ఉపవాసాలెందు...
పొర్లి పొర్లి పెట్టిన ఒంగు దండాలెందుకు
పెల పెలా లెంపలేసుకుని కొట్టిన టెంకాయలు ఎందుకు..
హల్లెలూయ అంటూ చెల్లించే స్తోత్రాలెందుకు
అవినీతిని వీడలేని ఈ భక్తి క్రియలెందుకు
నిశ్శబ్ద కవిత
🌺Kalimulla🌺
మీలో నేను మీతో నేను-
✨పనికి రారు అనుకున్న వాళ్ళే ఈ సమాజానికి మార్గదర్శనం చేస్తారు వాళ్ళ చరిత్రను చదివింపచేస్తారు.✨
✨Kalimulla✨
మీలో నేను మీతో నేను-
✨ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించి విజేతలమని చెప్పుకునే వారే ఈ సమాజానికి పట్టే చీడలు .
చివరికి వారి అంతరాత్మను కూడా వారు జయించలేరు✨
Kalimulla
మీలో నేను మీతో నేను-
💖ఎగిసిపడుతున్న ఉద్వేగాలకు
ఓ చిన్న ఓదార్పు పొందలేనప్పుడు
అవిచ్ఛిన్న నిశ్శబ్దం అనంత శూన్యాన్ని పరిచయం చేస్తుంది💖
🌸 Kalimulla 🌸
మీలో నేను మీతో నేను-
✨ మనుషులు ముందు గోతులు తీసి
తర్వాత నీతులు చెప్పడం మొదలుపెడతారు ✨
🌸 Kalimulla 🌸
మీలో నేను మీతో నేను-
❤️🩹 బరువుగా బిగిసిన ఉద్వేగాల వెనుక
ఓ తీరని కలే ఉంటుంది అనంత నిశ్శబ్దం విస్పోటనం చెందుతూనే ఉంటుంది ❤️🩹
🌸 Kalimulla 🌸
మీలో నేను మీతో నేను-
❤️🩹ఉద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి
కన్నీళ్ళను పొదుపుగా కార్చాలి❤️🩹
🌸Kalimulla🌸-