హాని కలిగించని ఏకైక వ్యసనం...
-
అప్పట్లో పోయేదంట
చదవేస్తే ఉన్న మతి..!
ఇప్పట్లో పోతుందట
చదివిస్తే ఉన్న ఆస్తి..!-
తెలుపుంటేనే అందం
నలుపుంటే వికారం..
పట్టుబట్ట కడితేనే ధనికులు
నూలుపోగు చుడితే పేదలు..
అని, పై పై చూపులతో
పక్షపాతపు పసరును
పసిమెదళ్ళపై పిండిన
పాపపుచదువులు ఎవరిని ఉద్ధరించడానికి..?
రేపటినాడు, జనులను రెండుగా చీల్చడానికా
వారి తనువులను నిండుగా కాల్చడానికా..??-
గురుకులాలకు వెళ్లి గురువును సేవిస్తూ
చదువు నేర్చుకోవడం ఒకప్పటి తరం.
పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి చదువు నేర్చుకోకుండా
చదువు'కొని' గురువుల మీద సెటైర్లు వేయటం ఇప్పటి తరం.-
కూనలమ్మ కూతలలో కవ్వించి మురిపించేవు
నిశిరాతిరి జాగరణలో వరియించి చిగురించేవు
తలపుల కాంక్షలలో జనియించి మరిపించేవు
ఆశయ సాధనలో అరుదెంచి జ్వలియించేవు
బుడి బుడి నడకలలో వేలుపట్టి నడిపించేవు
అడుగుల సవ్వడిలో అడుగడుగున తోడుండేవు
వయసుల బేధములో ఉత్సాహము నింపేవు
మనసుల అంతరాళాలలో ప్రోత్సాహము పెంచేవు
ఊపిరుల ఉఛ్ఛ్వాసములలో ప్రాణమై నిలిచేవు
నీ మీద నాకెందుకింత పిచ్చిప్రేమ
కలనైనా మరువలేను నిను
పరీక్షల ప్రేయసినైన నేను...-
జీవితం అంటేనే గెలుపు ఓటముల కలయిక.
ఈరోజు ఓడిపోయావని రేపటి గెలుపు రుచి చూడకుండా జీవితానికి ముగింపు పలికితే ఎలా??!!-
సంస్కారం లేని సన్నాసులు ఎంతమందో!
చదువు"కొంటున్న" కాలంలో,
సంస్కారం అమ్మే వాళ్ళు ఎంతమందో!!?-
ఏందివయా నీ లొల్లి
గల్లీ గల్లీ తిరిగి ఏదో కిర్రాక్
ముచ్చట్లు చెప్తున్నవంట గదా.
( Caption)-