రేపు బ్రతకాల్సిన బ్రతుకంతా ఇప్పుడే బ్రతికేస్తా,
రేపటికి ఒంటరినైపోతే,
ఇప్పుడు బ్రతికే బ్రతుకు కూడా రేపటికే మిగిల్చేస్తా,
రేపు నీతో బ్రతికేలా ఉంటే...-
ఎడారిదిబ్బలు ఎదలు!
తుఫానుగాలులు శ్వాసలు!
కన్నీటిదీవులు కనులు!
రేపు బ్రతకాల్సిన బ్రతుకంతా ఇప్పుడే బ్రతికేస్తా,
రేపటికి ఒంటరినైపోతే,
ఇప్పుడు బ్రతికే బ్రతుకు కూడా రేపటికే మిగిల్చేస్తా,
రేపు నీతో బ్రతికేలా ఉంటే...-
నా ప్రేమ నీ ఊపిరి దిగువకు ఇంకా చేరలేదని,
ఓ గోరు వెచ్చని బాధ నా మనసుధి!-
నీ దూరం నా మనసుని/చితిలో పడేస్తుంది!
నీ మౌనం నా మెదడుని/పీక్కుని తింటుంది!-
ప్రతి క్షణమున నా గతం, నిలిచున్నదే శాశ్వతం!
అడుగడుగున జీవితం, నీకోసమే అంకితం!-
గాలికి వదిలేసిన ఇనుము /
విరహానికి వదిలేసిన హృదయము.
రెండు తుప్పు పట్టక మానవు....-
నీ బుల్లి బుల్లి మాటలు,
చిట్టి పొట్టి అడుగులు దాటి
నువ్వు ఇలా ఎదుగుతూనే ఉండాలని కోరుకుంటూ...
Happy Birthday kapil😍-