నీ వీర్యపు గ్రంధుల సుఖానికి ఒక స్త్రీ మానం కావాలి
నీ పశువాంఛకు ఒక స్త్రీ ప్రాణం కావాలి.-
PERFECTLY IMPERFECT
There is no FUTURE in the PAST✌✌
Proud TELANGANITE💪
For te... read more
అభిమానించడం వల్ల ఒక బంధం మొదలవుతే,
అనుమానించడం వల్ల ఒక బంధం ముగుస్తుంది.-
మాంసపు ముద్దలతో నిండిన యుద్ధభూమిలో
ఎరుపెక్కిన రక్తపు హస్తాలతో నాటిన విత్తు పూవుల్ని పూయిస్తుందా??!!-
అక్షరాలని పోగేస్తున్నా ఆలోచిస్తూ...
ఆలోచించడం మాని ఏదైనా కథ రాయడం మొదలుపెట్టమన్నాయి.-
జీవితంలో కొన్నిసార్లు కిందపడడం మంచిదే..
ఆ వర్షపు చినుకుల్లా!!
ఆ సంద్రపు కెరటంలా!!
ఇంకొకరికి ఆనందాన్నిస్తూ......-
చిట్టి తల్లి/తండ్రి
నీకు
వెలుగు చూపించాలని
వెన్నెల్లో గోరు ముద్దలు తినిపించాలని
నాన్న గుండెలమీద నడవాలని
నా వేలు పట్టుకు తిరగాలని
జీవితంలో సంతోషం నింపావని
ఎన్నో కలలు నీ మీద ఎన్నో ఆశలు
కానీ
దేవుడు పరమ పాపాత్ముడు
వెలుగు చూడకముందే చీకటి నింపాడు
శ్వాస తీసుకోకముందే ఊపిరి ఆపేసాడు
చిట్టి తల్లి/తండ్రి
నీవు రాకముందే జీవితం మొత్తం ఉహించుకున్నా
ఏడ్చి ఏడ్చి కన్నీరు కూడా ఆగిపోయింది ఊహలు ఉహల్లాగే మిగిలిపోయాయి
నీ జ్ఞాపకాలు నా గుండెల్లో పదిలం కానీ నీకోసం చూస్తూ చూస్తూ మనసు మాత్రం బరువు
నీకు ఇవే నా శ్రద్ధాంజలులు...
-
తమ ఆత్మస్థైర్యాన్ని నమ్మకుండా అదృష్టాన్ని మాత్రమే నమ్మేవారే అసలైన దురదృష్టవంతులు.....
-
నిశ్శబ్ద సంద్రంలో
వేసెను వారు వలలు
భవిష్యత్తుపై ఎన్నో కలలు
భీకర అలలతో వచ్చెను ప్రళయాలు
ఛిద్రమైన ఆశలు
మిగిల్చేను విషాద జ్ఞాపకాలు-