జీవిత'కాలం'
-
.
#sbtelugu : Telugu quotes
#sbenglish_ ... read more
To the special human,
A not so special note.
// Full letter in caption 👇 //-
ఈ తపనేంటో ఎరుకవ్వదు
నీ కోసమే ఈ ఆరటమని తెలుస్తోంది,
ఈ విరహమేంటో ఇంత చేదు
నీ కౌగిళ్ళకై వేచి చూస్తోంది..!
హద్దులులేని ప్రేమను దాచే
నీ గుండె జాడ తెలీక,
మనసుని ముల్లోకాలుగా తలుస్తూ
ఈ ప్రేమేంటో పిచ్చిగా పరిగెడుతోంది..!
నిరీక్షణ ఇంక చాలంటూ,
దాగుడుమూతల ఆగడాలు తగదంటూ,
పున్నమి రాకకి సముద్రుడి తుళ్ళింతలా,
మనకోసం కాచే వెన్నెలకై
చకోరంలా నా ఈ ఎదురుచూపులు..!!-
ఊరించే ఆశలే వెన్నుతడుతూండగా...
నిశీధిలో జాబిలి వెలుగే స్వాంతనివ్వగా...
కటిక చీకటేళ తారలే కన్నుల్లో కాంతులు నింపగా...
ఇంతకన్నా చక్కనైన సందర్భమేముంది?
చిక్కటి నలుపులోనూ చక్కటి తెలుపు ఛాయలు కానొస్తూ,
కలల సంతోషాలెంట పరిగెట్టే ప్రోత్సాహమే ఇవ్వగా...
సాకారం చేసుకునే దిశలో పయనమే మొదలెట్టే,
స్ఫూర్తి ఆత్మవిశ్వాసాలే సొంతమవ్వగా...
ఇంతకన్నా అందమైన క్షణమేమున్నది ఇక నాకైనా నీకైనా..!!-
మేఘం విడిచిన ముత్యపు చినుకుల్లా...
ఆహ్లాదంగా సాగుతూ కొన్ని కవితలు,
అలజడి సృష్టిస్తూ ఇంకొన్ని కైతలు,
అందమైన ఆంగ్లమైనా తీయనైన తెలుగైనా సరే...
ఆసక్తికరంగా సాగే నీ చిట్టి కథలు,
ఛందోబద్ధమైన వ్యాకరణంతోనైనా సరే...
అక్షరాలతో ఆటాడిస్తూ నువు రాసే గజల్స్
మరియు ఇతర కవితా ప్రక్రియలు,
యదార్థమైనా హాస్యమైనా, బాధైనా బంధమైనా ప్రేమైనా...
ఇట్టే ఒదిగిపోతాయిలే నీ పదాల ఒరవడిలో,
నలుపైనా తెలుపైనా అందమేలే నీ రాతలలో చేరగా,
దేనిదైనా సరే ఏదైనా సరే బహుచక్కనైన భావవ్యక్తీకరణతో
నువు రాసే రచనలు హర్షించేలా ఉంటాయిలే.
నిశిలోన తళుకులీను తారలు,
తెల్లటి నీ కాగితంపై పడగా,
మెరిసేవే నువు అల్లే అక్షర మాలలు.-
ప్రపంచాన్నే మర్చిపోయి, మన ప్రేమతో
ఒక చిన్ని ప్రపంచాన్ని నిర్మించుకొని,
నీతో ఆనందవిహారం చేయాలని,
ఎదురు చూస్తున్నా నీ నేను నా నీకోసం
(ఉపశీర్షికలో👇)-