Varoodhini Prasad   (అజగవ)
480 Followers · 181 Following

ఘడియ ఘడియొక నవ ఆశాకిరణం
భావోద్వేగాల సమ్మిళిత భాండాగారం జీవితం..
Joined 7 July 2019


ఘడియ ఘడియొక నవ ఆశాకిరణం
భావోద్వేగాల సమ్మిళిత భాండాగారం జీవితం..
Joined 7 July 2019
13 APR AT 18:15

ధరణి పడతి అందాలను ముద్దాడ ఆకాశం
తొంగి తొంగి తన వంక చూస్తూనే ఉంటోంది
ఎలా వీలు అవుతుందని ఆలోచన చేస్తోంది..

ఇంతలోనె తన కళ్ళలొ ఆనందపు భాష్పాలు నేలమ్మను తడిమెనంట..
పులకరింపజేసెనంట..

-


14 JAN AT 5:51

The pain you endure holds the power to heal you

The quest within you is what will elevate you

-


10 DEC 2024 AT 12:38

చీకటిగా ఉన్న జీవితంలో ఆశయాలు ఆశలు కలగలిపిన మిణుగురుల వెలుగులే ఆనందాలు..

-


27 NOV 2024 AT 8:18

తరలి రారు ఏ ఆప్తులు నీ పయనపు బాటలో
తోడు రావు ఏ అడుగులు నేనున్నా పదమంటూ

నీ ఆశలు నీవేలే
నీ ఆశయాలు నీవేలే
నీ సాధన దృఢమైతే
నీ అక్కున చేరునులే
విజయపు వసంతాలు

పడుతు పడుతు లేస్తూనే పరిగెత్తుతూ సాగిపో
అలుపన్నది రాకముందే దృఢముగా మారిపో

నిను చూసిన ఈ ప్రకృతి తోడుగా ఉంటుంది
ఒంటరని అనుకోకు ఈ విశ్వముంది నీతోనే

ఒక్కసారి గెలిచాక మ్రోగుతాయి చప్పట్లు..
అపుడొస్తాయి ఆప్తులంటూ ఆడంబరపు చూపులు..

-


25 MAY 2024 AT 13:53

సముద్రాన అలల అలజడి నా ఆలోచనల ప్రవాహం..
నడిసంద్రపు నిర్మలత్వం నా మనోవికాసం..

సంద్రపు ఆటుపోట్లు నా సమస్యల వలయం...
ప్రకృతి అందం నా మనో నిశ్చలం..

-


14 MAY 2024 AT 1:13

నను తాకు రవికిరణపు వెచ్చనైన అనుభూతులు
ఈ గాలి పరిమళాలు మది గెలిచే ప్రయత్నాలు

పచ్చదనపు పసిడి ఛాయ ప్రకృతమ్మ లాలిత్యం
మాట్లాడే మనిషిలాగ అనిపించెను ప్రతిక్షణం

కొండ కోన చెట్టు చేమ అద్భుతమే ఈ సృష్టి
సాటి లేదు ఏది కూడ పోలికకే సరి తూగదు

-


1 FEB 2024 AT 9:59

నీ ప్రతిబింబం నేనేనంటూ ఆ సంద్రముతో చెలిమి కట్టి హృదయలహరితో నాట్య భంగిమలో తన్మయమొందిన మేఘావృతం...

పులకరించి ఉప్పొంగే అలలతో పలుకరిస్తోన్న ఈ సాగరం...

రెండిటి అందాలకు ఆలవాలమై కనులారా వీక్షిస్తున్న ఆ ప్రభాత భానుడు...

లావణ్యపూరిత దృశ్యాలకు ఆధారం ఈ ప్రకృతమ్మ...
అదృష్టాన్నందిన నయనములు హర్షాశృవులనే విడిచెను తన్మయమోపలేక..

-


22 JAN 2024 AT 6:27

కవితలన్ని కదిలి వచ్చె ఆవేశపు ఆలోచనై..
గుండెసడుల అక్షరాల వెల్లువలై వేకువలో..
ధ్వనిస్తూ జ్వలించే సంకల్పపు ఢమరుకమై..
అదుపులేక నాట్య జతుల నర్తనమై నర్తించే..
ఆ నర్తనపు నట కౌశలత ఈ విశ్వము గ్రహించే..
ప్రతిధ్వనిగ తను మారుతూ ప్రతి దిక్కుకు ప్రసరించే..

-


7 JAN 2024 AT 18:51

చుక్కల రెక్కలు చెక్కిలి తాకిన అనుభూతినేనొందుతున్న...
అందమైన జాబిలమ్మ అందమంత చూసినట్టు కొత్త కొత్త ఊహలలో ఊయలనేనూగుతున్న...
అనుభవాల పాత సారమనుభూతుల కొత్తసారం కలబోతల మిశ్రమాన్ని కనులముందు చూస్తున్నా...
హరివిల్లున రంగులన్ని చుట్టుముట్టి చేరినట్టు
వింత వింత పోకడలను ఈనాడే చూస్తున్నా...
సరిహద్దులు లేనట్టి ఆనందపు అంచులలో రెక్కలు లేకనె నేను విహారమే చేస్తున్నా...

-


5 JAN 2024 AT 22:05

అలలు లేని సాగరాన్ని చూడాలని కాంక్షించా..
మధురమైన వసంతాలు నావంటూ నే తలిచా..

కానీ అగాధాలు తప్పవనీ
ఆటుపోట్లు ఆగవనీ
అలలే ఆ సంద్రపు అందమనీ

కలలే జీవితాన సాధనాలని
ఆ శిశిరం వెనువెంటనే వసంతం వికసించునని
ఏ బాధను మది పొందిన
క్షణికాలమే అవి అన్నీ సంతోషపు రాకలనే
కనుగొన్నా
కనుగొన్నా
ఆ విజయపు నగారాని
వాయిస్తూ
వాయిస్తూ

ఈ నదీజలపు ప్రశాంతతను నాలోనే దాచుకున్నా..

-


Fetching Varoodhini Prasad Quotes