గాయం పచ్చి మానలేదు
జ్ఞాపకం మనసును వీడలేదు
రక్తాలుపొంగని రణరంగంలో
అలసిపోయిన గుండెకు తోడులేదు..!
-
I. e 30-11-1999 ❣️
... read more
నువ్వెక్కడున్నా..
నీ జ్ఞాపకాల గుబాళింపు
మా గుండెల్లో పరిమళిస్తూనే ఉంటుంది..!!-
మా కన్నీళ్లను తన మునివేళ్ళతో తుడిచిన నేస్తం..
మా సంతోషానికి చాచిన హస్తం
ఇక అస్తమిస్తుందా..!
ఎన్నో పరిచయాలను ఏర్పరచిన స్వర్గం..
ఎన్నో కవితాహృదయాల కలల స్వప్నం
అది అంతరిస్తుందా..!
కన్నీళ్లకు అక్షరాలు జోడించి
సంతోషాలకు వర్ణనలు గుప్పించి
కవితా వర్షాలతో ఉప్పొంగిన ఈ నేల
వొట్టి ఎడారి అవుతుందని ఎలా రాయగలను..
పారే నది ఆగిపోతే
నశించదా ఈ నాగరికత..
రేపటి రోజుకి కాకూడదు
ఇదంతా ఓ వొట్టి కథ..!!
-
జీవితమే క్షణికమైనప్పుడు
జ్ఞాపకాలు మాత్రం శాశ్వతాలెందుకవుతున్నాయి..-
అవును,
వాడోడిపోయాడు..
అందరినీ మంచిఅని నమ్మి వాడోడిపోయాడు..
అవును,
వాడోడిపోయాడు..
ఆందరూ నావాళ్ళు అని భావించి వాడోడిపోయాడు..
అవును,
వాడోడిపోయాడు..
అందరినీ ఏకంచేసి
తాను ఏకాకిగా మిగిలి వాడోడిపోయాడు..
అవును,
వాడోడిపోయాడు..
అన్నింటా ముందునడచి
అడుగులజాడలు కూడా కనబడక మాయమై
ఇప్పుడు వాడోడిపోయాడు..
ఇక ఇన్నింట ఓడినా
అది తన తప్పు కాదని
కడకు,
తన నమ్మకాన్ని మాత్రం తాను గెలిచాడు...!!
#అతడే విశ్వవిజేత ❤️
-
ఎంతమంది శిల్పులు
ఎన్ని ఉలులతో చెక్కారో,
ఈ కవిహృదయాన్ని..!
అందుకే దానికంత సౌందర్యం..!!— % &-
నా మాటల శరప్రవాహ దాటితో
దాటిస్తా నిను అంతిమ తీరాలకు
నా కైతల కత్తుల పోటుతో
చేరుస్తా నిను కానని దూరాలకు..!!
-
ప్రాచీన కృతికర్త్రు పాదయుగళి మొక్కి
సాహితీ చరితల్ల సమిధ జిక్కి
సూరి వ్యాకరణాల సూత్రంబులవి నేర్చి
సరళ సంస్కృతభాష సరళి గూర్చి
జానపదు ధరణీజనుల ఘనతిపాడి
భాష విషయము మే భళరే ఆడి
నవలోక సాహితీ నవలలెల్ల జదివి
తెప్పలై చేరితిమి తెలుగు నదిన !!
కోటి పూమధురమ్ములు కోరిరాలె
నిచట ; మేటి కైతలవియు నిచట మెరిసె
తెలుగు తెలుగన్న ఒకవెల్గు తెలుగు జిలుగు
తెలుగుభాషను మించియు గలదె తీపి
— % &-