అడుగులు మోసే అవనో అమ్మ
ఆకలి తీర్చే అన్నము అమ్మ
దేహంలో ప్రతి అణువు అమ్మ
దాహం తీర్చే జలమో అమ్మ
గాలీ, గగనం, మేఘం అమ్మ
ప్రాణం నిలిపే ప్రతిదీ అమ్మ...
తప్పును దిద్దే నాన్నో అమ్మ
ఆతని కన్నుల చెమ్మో అమ్మ
దైవ సమానులు గురువులు అమ్మ
త్యాగ మూర్తులు తరువులు అమ్మ...
ధైర్యం పెంచే మాటో అమ్మ
దుర్మార్గుల చీల్చే కత్తో అమ్మ
అన్నార్థుల ఆకలి తీర్చగ కరిగిన
కదిలొచ్చే ప్రతి మనసో అమ్మ...
కనిపెంచిన రూపమె కాదు
కరుణించిన గుణమో అమ్మ
చితి చేరే చిరు పయనంలో
ఎదురయ్యే ప్రతి మమతో అమ్మ
సంధ్య.Ch
-
ఆకాశమంత కాగితంపైన
ఇసుకరేణువులన్నీ అక్షరాలైనా...
సరిపోవుగా అమ్మని పొగడాలంటే!-
అమ్మనే అయ్యాను
అక్క అనే ఆప్యాయతలో
అమ్మనే అయ్యాను
భార్య అనే బాధ్యతతో
అమ్మనే అయ్యాను
అమ్మ అనే పిలుపుతో
అమ్మనే అయ్యాను
కూతురుగా రుణం తీర్చుకునేందుకు
అమ్మనే అయ్యాను
కథలు, పద్యాలు చెప్పేటప్పుడు
అమ్మనే అయ్యాను
జీవితపు ప్రతీ మలుపులో-
కష్టాలకు వెరవని
బాధలకు ఏడవని
బంధాలకు విలువిచ్చి
బాధ్యతలను నెరవేర్చి
అపజయాన్ని గౌరవించి
విజయతీరాన్ని చేరుకొని
ఆలోచనలకు ప్రాణం పోసి
ఆశయాలను ఆయువుగా చేసి
బతకడం అంటే మరణాంతరం కూడా
బతికే ఉండడం అని పసివయసు నుండి నూరిపోసిన
" ఆ పరిచయం ఒక వరం ".🤘
-
కైతికం..
వయస్సెంత వచ్చినా
విరమణలేదాపదవికి
అనుభవమెంతున్నా
మనం సాటిరామామెకి
వారెవ్వా అమ్మా
నేను నీ చేతి బొమ్మ..-
Mother (n)... అమ్మ
God who is the part of our lives from Womb to Tomb... 😍🙏💓-
నీ అడుగులు తోడవ్వని దారి ఎడారి
నీ రూపు అగుపడని ఈ చూపు నిర్జీవం
నీ స్పర్శకు నోచుకోలేని ఈ దేహం మలినం
నీ మాటెరుగని ఈ జీవితం వ్యర్థం
నీ తోడు లేక నే చేరే గమ్యం శూన్యం-
పుట్టిన ప్రతి పసికందు కంటినిండా ఏడ్చునెందుకో?
పవిత్రమైన పేగు బంధం తెగిపోయినందుకా......
అది చూసిన అమ్మ కడుపారా నవ్వునెందుకో?
మరో తనను మనసారా చూసినందుకా...!-
తల్లి కాబోతు౦దని తెలిసిన క్షణ౦ నుండి ఊహలకి హద్దు౦డదు కాబోయే అమ్మలకు
ఎన్నో జాగ్రత్తలు కను తెరవబోయే చిన్ని ప్రాణం కొరకు
ఆ చిన్ని ప్రాణానికి అనారోగ్యకరమైనదైతే ఆ అమ్మకి అ౦తకు ము౦దు వరకు అది ఎ౦త తీపైన అప్పటి నుండి అది చేదు..
ఆ చిన్ని ప్రాణానికి ఆరోగ్యకరమైనదైతే ఆ అమ్మకది ఎ౦త చేదైనా అప్పటి ను౦డి అది మధువుతో సమాన౦
అలా ప్రతీదా౦ట్లో వాళ్ళ ఇష్టాలన్న పదమే మర్చిపోయి ఎన్ని అవస్థలైనా రాబోయే బోసినవ్వులకోస౦ నవ్వుతూ తీపి బాధగా భరిస్తుంది ప్రతి అమ్మ
ఒక్కో నెల ఒక్కో అనుభూతి అ౦త ఆశతో ఎదురుచూసే ఆమెకి పురిటినొప్పులు కనిపి౦చవు పాప ఇ౦కాసేపట్లో తన చేయిని తాకబోతు౦దని ఉత్సాహం అ౦తలోనే ఆ౦దోళన తను క్షేమంగా ఉ౦డాలని వేడుకోని క్షణము౦డదు
Plz Read in caption 👇-