పస్తులున్న కడుపులో
పది ముద్దలు పడితే
పండగే !
అదే జరగనప్పుడు
ఎంత పెద్ద పండగైనా
దండగే !!-
కులాల గొడుగులో
మతాల మడుగులో
విషాలు చిమ్ముతు
నషాలమంటెను ద్వేషం !
విశాల మనసుల
విషాలు పండగ
నిషాలు నిండగ
స్మశానమేగెను దేశం !!-
అప్పుడే పుట్టిన పాపాయిని చూసిన తల్లి కళ్ళల్లో మెరుపు..
తొలకరి జల్లులకి పులకరించిన రైతు కళ్ళల్లో మెరుపు...
ప్రయోజకులైన పిల్లలను చూసే తల్లిదండ్రుల కళ్ళల్లో మెరుపు...
దేశాన్ని శత్రువుల బారి నుంచి తెగించి కాపాడిన సైనికుడి కళ్ళల్లో మెరుపు...
ఆ సైనికుడి రాకను తెలుసుకున్న తన కుటుంబం కళ్ళల్లో మెరుపు...
రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బును చూసిన కార్మికుడి కళ్ళల్లో మెరుపు...
భిక్షగాడికి పట్టెడన్నం పెట్టినప్పుడు తన కళ్ళల్లో మెరుపు...
పసిపిల్లలకు చాక్లెట్/ఐస్ క్రీం కొనిచ్చినప్పుడు వాళ్ళ కళ్ళల్లో మెరుపు...
హాస్టల్ నుండి సెలవులకి ఇంటికెళ్లే విద్యార్థుల కళ్ళల్లో మెరుపు...
తమ అభిమాన ఆటగాడు/నటుడు/నేతను చూసిన అభిమాని కళ్ళల్లో మెరుపు...
తప్పిపోయిన పిల్లలు తిరిగి వచ్చినప్పుడు తల్లిదండ్రుల కళ్ళల్లో మెరుపు...
న్యాయం గెలిచినప్పుడు సామాన్యుడి కళ్ళల్లో మెరుపు...
తమ మనవళ్ళు, మనవరాళ్లను కలిసినప్పుడు తాతా బామ్మల కళ్ళల్లో మెరుపు...
చాలా రోజుల తర్వాత అమ్మ చేతి వంట తినే పిల్లల కళ్ళల్లో మెరుపు...
ప్రియురాలి/ప్రియుడి తొలిచూపులో మెరుపు...
చివరగా
ఈ quote రాశాక నా కళ్ళల్లో మెరుపు...
ఏం ఇచ్చినా కొనలేం...
-
So
I Changed
{Places
Looks
Dresses
Professions
&
Finally
People}
Everything.
Still & Still
I didn't
Cause
Of
Attachments
&
My
Fucking
Mind.-
కడలికెదురెళ్ళి కనుమరుగైపోవు
కట్టేపుల్లను గాను నేను !
ఆ కడలినీ, ప్రతి కల్లోలాన్ని
ధిక్కరించే అగ్నిస్ఖల శిఖరాన్ని నేను !!-
నిజాలు పట్టని ఈ జగతికి
యుగాలు పట్టే ఈ గతికి
శవాలు పుట్టే ఈ సవతికి
భయాలు ఇట్టే ఈ మతికి
శుష్కించిన ఈ జగతిని
భక్షించేనే ఈ మందమతి !-
నిజాలనెదుర్కోలేని
ఇజాలను
భుజాలపై మోసి,
బాజాలు కొట్టే
భక్తులకి ఈ
నిజమెప్పుడూ
మింగుడుపడని
గరళమే !
జేజేలు కొట్టించుకునే
దైవ సమాన పాత్రలో
జీవించు కపట నాటక
నాయకులూ/కథానాయకులూ
ఎన్నో కొన్ని సార్లు కునుకు
మరిచి తమను తాము
చీదరించుకునేదీ జీవితమే !!-
అందని దాన్ని అందలమెక్కించడం,
అందే దాన్ని అవతల పెట్టడం
మనుషులకి షరా మామూలే !-