నీతో ప్రయాణం ఖండాలు దాటక్కర్లే
దేశాలు చుట్టక్కర్లే
ఒక్కడుగేస్తే చాలు-
Joined in yq on 16th feb 2018 by luck to share my heartf... read more
తను రాస్తుంది తెల్లకాగితం పై... మౌనంగా...
నే చూసా... తెల్లకాగితం మీద అక్షరం ముక్క లేదు...
మౌనాన్ని రాస్తుందిగా...
మాటలకందదు...
అక్షరాల్లో ఒదగదు...
కాగితంపై ఒరగదు...
ఆ అక్షరాలు చూడాలంటే ఆ మనసుని చదివుండాలి
లేదా రాసిన మనిషే చదివే సాహసం చెయ్యాలి.
ఆ అక్షరాలు చదవాలంటే
అనంతమైన ప్రేమను శ్వాసిస్తుండాలి
లేదా ఆ ఎదుటి వ్యక్తి ఊపిరికి
తాళం వేస్తుండాలి.
ఇది సాధ్యం కాని అజ్ఞానుల ముందు నిరూపించుకునే ప్రయత్నం మాని
నిర్ణయాన్ని వాళ్ళకే వదిలేయ్...
దూషించి, వేదించి, మరుగున పడతారు
ఈ లోపు నువు కాస్త మెరుగుపడతావ్..-
మనల్ని కూడా ప్రేమించే మనిషుంటే బావుండు...
ఈ మనసు బరువు తెలిసేది!-
Premium teeskunte okesari download cheskovchhu booklet anundiga... Download cheste just 120 quotes vchhai... Idhela? 🥺
-
మనిషిని మనిషిలా కాకుండా
అవసరంతో పోలిస్తే అర్ధమవుతాడు..
అవసరానికి మించి
మనిషి పాత్రుండదు...-
అవాంతరాలన్నీ
అర్ధాంతరాలకేనా!
ఇలా అగమ్యగోచర
జీవితం కోసమేనా!
కనిపించని ఈ కన్నీళ్ళు
గతాన శిథిలమయే
వేదనకు ఋజువులు...-