నేను
చదివిన
చదువుతున్న
చదువబోయే
చదవాల్సిన
పుస్తకము
జీవితం
ఇంకా
చదువుతూనే ఉన్న
ఈ ఊపిరి ఉన్నంత వరకు
చదువుతూనే ఉంట-
పుటలతో పనిలేని పుస్తకం
అది, నటనలెన్నో నేర్పే మాయా మస్తకం..
అనుభవాలే అందులోని అధ్యాయాలు..
ఓటములే అవి గెలుపులను గొలిపే పాఠాలు..
ఇందులో పరిచయం అక్కర్లేని పాత్రలు కొన్నైతే..
పరిచయం ఉన్నా అక్కర్లేని పాత్రలు ఇంకొన్ని..
ఈ పుస్తకాన..
తిరగేసిన కాగితాన్ని మరచి ఉండలేనివారు కొందరు..
తిప్పలేని కాగితాన్ని తెరచి చూడాలనుకునేవారే అందరూ..!!
అదే జీవితం..
లేదు దానికి గతం..!!
-
మా నాన్న
నేను చదువుతున్న పుస్తకం
నా భర్త
నేను చదవాల్సిన పుస్తకం
నా బిడ్డ-
జీవితాన్ని మార్చలేదు
కానీ
జీవితంపై నా దృష్టిని మార్చింది
పరిస్థితులని మార్చలేదు
కానీ
పరిస్థితిని బట్టి స్పందించే గుణం నేర్పింది
ఎదుటి మనిషిని మార్చలేదు
కానీ
నా మనసులోని బుద్ధిని మార్చింది-
మనిషిని మార్చే స్వార్థం
విచక్షణని మరిపించే ఆకలి
డబ్బుని గెలవమనే పేదరికం
మన వాళ్లెవరో తెలిపే కష్టాలు
జీవితం లోతు కొలిపించే కన్నీళ్లు
బతుకు ప్రాముఖ్యత తెలిపే చావు
విజయం విలువ తెలిసేలా చేసే ఓటమి.🤘-
మొదటి పేజీలో
నా శరీరంలో కదలికలు, కన్నీళ్లు
నా వాళ్ళ మోములో ఎనలేని ఆనందం... చివరి పేజీలో నా మౌనం, దేహం అచేతనం..
ఈ సారి నా వాళ్ళ ముఖంలో విషాదం.. మధ్య పేజీలు అన్నీ, అంత గజి బిజీనే..-
చందమామ
బాలజ్యోతి
బాలమిత్ర
ఎన్నో కథల పుస్తకాలు
చిన్నప్పుడు బాగా చదివేదాన్ని
వాటిల్లో నాకు మరో అద్భుత లోకం కనిపించేది-
ఎన్ని మంచి పుస్తకాలు చదివినా
దానికి సాటిరాని
నేను చదివిన మంచి పుస్తకం...
"శ్రీమద్భగవద్గీత"
బడిలో చదువుకునే రోజుల్లోనే
తెలుగులో భావాలు చదువుకొని
స్వీయప్రేరణ పొందేదాన్ని.
ఇప్పుడు విధులలో తీరిక లేకున్నా
తీరిక చేసుకొని వెతికినా
ఇంతకన్నా మంచి పుస్తకం ఇలలో దొరకదు.
దొరకాలంటే శ్రీకృష్ణుడు
మరలా జన్మించాలి కదా!-
పుస్తకాలు చదివి అన్ని తెలుసుకుంటాం
అన్నీ నేర్చుకుంటాం....కానీ...ఎన్ని పుస్తకాలు చదివి ఏమి లాభం...ఎదుట మనిషి మనసు చదవలేనప్పుడు....
ఇంతకంటే గొప్ప పుస్తకం లేదంటాను నేనైతే-
పుస్తకం: "3 మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్"
రచయిత: ఎంతో కొద్ది సమయంలో భారత
దేశ యువతకు దగ్గరైన "చేతన్ భగత్"
విడుదల : 1వ తేదీ,ఒకటవ నెల,2008.
పబ్లికేషన్స్: రూపా పబ్లికేషన్స్.
సినిమా : హిందీలో విడుదలైన "కాయి పో చె"
(శీర్షికలో చదవండి)
-