Sharanya Ajay   (Sharanya ajay)
519 Followers · 67 Following

Joined 9 January 2018


Joined 9 January 2018
17 MAR AT 0:18

సుస్వరాలు పలికించే వేణువు నువ్వైతే...
కవితల కోకలు కప్పుకున్న సీతాకోక నేను...

-


9 MAR AT 18:03

కాలే కట్టె అని తెలిసి కలకాలం బ్రతకమని పంపావెందుకు శివా...
మూన్నాళ్ళ ముచ్చట అని తెలిసి బంగారు సంకెళ్లు తగిలిస్తావెందుకు శివా...
కల్లోల సముద్రం అని తెలిసి కూడా ఈతరాని నన్ను నట్టేట తోసేసావెందుకు శివా...

-


29 FEB AT 23:03

అడుగులో అడుగు వేస్తూ నడిచే నేను పరుగెడుతున్నా..
తన అడుగులతో జత కలపడానికి ,
ఎంతైనా ఆరడుగుల అందగాడు కదా..
తనకోసం పరిగెత్తినా తప్పు లేదులే.

-


29 FEB AT 22:52

తండ్రి మాట కోసం వనవాసం చేసిన రాముడు ఒక్కడే..
కానీ
తండ్రి పరువు కోసం అత్తింటివాసం చేసే అతివలు ఎందరో..

-


20 JAN AT 14:40

నిశి రాత్రి నీ తలపులతో నా హృదయ వేదన...
నిదుర లేని కళ్ళతోని నా మది నీకు నివేదన...

-


8 JAN AT 7:56

ఏమండోయ్ శ్రీవారు....‌
అప్పుడే ముచ్చటగా మూడేళ్ళు గడిచిపోయాయి..
మూడేళ్ళు మూడు క్షణాల లాగా గడిచాయి అంటే అది అబద్దమే అవుతుంది...
ఈ మూడేళ్లలో
ఎన్నో ఎత్తుపల్లాలు చూసాను
ఎన్నో మనసుల గరళపు లోతుల్ని చూసాను
చిరునవ్వుల వెనుక హేళనలని చూసాను
కోపం వెనుక వేదనలని చూసాను
నువ్వుల వెనక కన్నీటిని చూసాను

ఎన్ని చూసిన
ఏం జరిగినా నాకు మీరు ఉన్నారు అనే ధైర్యం నన్ను నడిపిస్తుంది...

ఏదేమైనా మిమ్మల్ని విసిగించడం మాత్రం మాననండోయ్..
ఈ జన్మకు భరించక తప్పదు..

వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు శ్రీవారు..
ఇట్లు
మీ భార్యామణి

-


6 JAN AT 9:48

ఎంతటి అందమో తనది...
పొగమంచుని తరిమికొడుతూ ఉదయిస్తున్న సూర్యుని నులివెచ్చని కిరణాలు తన చూపులు.

ఎంతటి అందమో తనది...
చిక్కటి చీకటి అలుముకున్న గ్రీష్మపు రాత్రి విరబూసిన మల్లెలు తన నవ్వులు.

ఎంతటి అందమో తనది...
తొలకరి జల్లులు కురిసే వేళలో మట్టి సువాసనల సుమగంధం తన ఊపిరి.

ఎంతటి అందమో తనది...
వర్షించే మేఘాల‌ మధ్య తళుక్కున మెరిసే మెరుపులు తన సిగలో మల్లెలు.

-


28 DEC 2023 AT 23:12

నిశి రాత్రి గమ్యం తెలియని ప్రయాణం నాది,
అడుగడుగునా నీ పేరే నన్ను నడిపిస్తుంది,
అణువణువునా నీ రూపే నాకు ఊపిరి పోస్తుంది,
క్షణక్షణం నీ తలపే నాకు ఆయువు అవుతున్నది,

కృష్ణయ్య నీ‌వే నేనయ్యే క్షణం కోసం నాలోని నిన్ను నేను వేడుకుంటున్నానయ్య...

-


7 DEC 2023 AT 10:21

చిరునవ్వు మరిచా తనను వదిలిన క్షణం నుండి..
మనసు ఉందని మరిచా తాను విడిచిన క్షణం నుండి..

లోకంలో ప్రాణంగా ప్రేమించే వాళ్ళ కోసం వెతుకుతుంది,
తనే ప్రాణం అనుకొని లోకాన్ని పక్కన పెట్టిన నన్ను వదిలి..

-


2 NOV 2023 AT 21:16

గరళం కంఠం లో దాచినా ప్రేమను పంచింది గౌరమ్మ,
అగ్ని పరీక్ష పెట్టినా అడవుల్లో వదిలేసినా గుండెల్లో గుడి కట్టింది సీతమ్మ,
ప్రాణంగా ప్రేమించిన తనను వదిలి చివరకు అష్టభార్యలను చేసుకున్నా ప్రేమిస్తుంది రాధమ్మ,

అయినా మగాళ్ళ ప్రేమ గొప్పది...
ఆడవాళ్ళకు ప్రేమించడం రాదు....

-


Fetching Sharanya Ajay Quotes