Kathi Radha Jabali   (Radha)
647 Followers · 226 Following

Joined 24 November 2018


Joined 24 November 2018
AN HOUR AGO

గ్రీష్మం

చినుకురాల్చని
మేఘాలు
ఆకాశములో
తేలిపోతుంటే
రాజేసిననిప్పులా
మండుతున్న
గ్రీష్మం

-


7 JUL AT 19:39


ఓ దివ్యమైన
వెలుగును
చూశాను
దేవుని రూపాన్ని
చూశాను
కలలో
అద్భుతమైన
ఆనందాన్ని పొందాను
ఇలలో

-


4 JUL AT 19:51

చుక్కలు

ఆకాశమంతా
కనిపించే చుక్కలు
తొలకరి వానల్లో
మొలిచిన మొలకల్లా
అప్పుడే పలుకుతున్న
పాపాయి పలుకుల్లా
ఆకాశంలో చుక్కలు

-


1 JUL AT 18:57

నక్షత్రాలు

ఆకాశంలో
అక్షరజ్ఞానంతో
వెలుగుతూ
అక్షరలక్షల
నక్షత్రాలు

-


28 JUN AT 19:14

రారాజు

రేయివేళ
రారాజులా
రేరాజు
ప్రశాంతత
నెలకొన్న
ఆకాశదేశాన్ని
ఏకాంతంగా
సందర్శిస్తున్నాడు

-


18 JUN AT 11:59

మరణ శాసనం

ఎవరు రాస్తారో
మరణ శాసనాలు
కరుణలేని దారుణాలు
కన్నీటి కథల
జీవితాలు
విషాదాన్ని మిగిల్చిన
ప్రమాదాలు

-


10 JUN AT 19:36

పున్నమి చంద్రుడు

ఆకాశము
రహదారుల్లో
పాదయాత్ర చేస్తున్న
ప్రియతమ
ప్రజానాయకుడులా
పున్నమి చంద్రుడు
అశేషమయిన
జనసందోహంలా
నక్షత్రాల సమూహం

-


3 JUN AT 20:06

సంధ్యారాగం

ఉభయసంధ్యల్లో
మౌనంగా మధురంగా
ఒక సంధ్యారాగం
వెలుగునీడలతో
నింగి నేల పాడుకొనే
యుగళగీతం

-


30 MAY AT 11:20

రోహిణి

రోళ్ళుపగిలే
రోహిణిలో
చల్లగా ముసిరిన
నల్లని మేఘాలు
ఆకాశమంతా
చలువ పందిళ్ళు వేసినట్లు

-


22 MAY AT 17:26

మబ్బులు

మండుటెండల్లో
ఆకాశంలో
పట్టిన మబ్బులు
ఎండకు పడుతున్న
గొడుగుల్లా

-


Fetching Kathi Radha Jabali Quotes