బతుకన్నది భారమాయె
మెతుకన్నదే కరువాయె
వలసకూలి బతుకులన్ని
చెరువెండిన చేపలాయె-
లాల్ సలామ్ కామ్రేడ్స్...
ఈ లోకంలో అందరూ కార్మికులు కర్షకులే...
ఆ తెల్లదొరల కాలం పోయినా, దోచుకునే తీరు మాత్రం మారనేలేదు,
ఎప్పుడూ ఓ కొత్త ముసుగేసుకుని దోచేసుకుంటున్నారంతా...
దాన్ని గుర్తించి తిరగబడితేనే నువ్ బ్రతగ్గలవ్,
చూస్తూ ఉండిపోయావా, నీ పలుగు పార కూడా నీక్కాకుండా పోతాయ్ జాగ్రత్త...
విప్లవాలు, నినాదాలు ఎక్కడినుండో పుట్టలేదు కామ్రేడ్,
అన్యాయం నుండి వచ్చే ఆవేశంలోంచి పుట్టినవే అవన్నీ...
కార్ల్ మార్క్స్, లెనిన్ లాంటోళ్ళూ నీలాగే సహించి సహించి చివరకు తిరుగుబాటు తనాన్ని రిగిల్చారు అందరిలో...
ప్రశ్నించే తత్వాన్ని అలవర్చారు...
ముందుండి నడిపించే తీరుని నేర్పారు...
అలా నువ్వూ ఓ నాయకుడిలా నిలబడు నీ జనానికి,
అపుడు ఆ ఎర్రజెండా నీకు గర్వంగా చెపుతుంది
" లాల్ సలామ్ కామ్రేడ్ " అంటూ...
ఇంక్విలాబ్ జిందాబాద్... విప్లవం వర్ధిల్లాలి...
వెన్నెల సతీష్...
-
భగ భగ మండే ఎండలో
నిప్పుకణాలై రగిలేవాళ్ళు
ఎముకలు కొరికే చలిలో
మంచు గడ్డలై నిలిచేవాళ్ళు
కురిసే ఝడి వానలో
శ్రమ చినుకులై రాలేవాళ్ళు
కండను పిండిచేసి
కొండను బండలుగా మార్చేవాళ్లు
నరం నరం తీగ చేసి
విద్యుత్ వెలుగులు తెచ్ఛేవాళ్లు
రుధిరాన్నే ఇంధనం చేసి
ప్రాణమున్న యంత్రాలై బతికేవాళ్ళు
శ్రమనే పరిశ్రమ ప్రగతికి
ఆయువుగా మార్చి శ్రమించేవాళ్ళు
తమలో ఆయువు ఉన్నంత వరకూ
అలుపెరగక శ్రమించే శ్రామిక సూర్యులు
నిరంతరం నిండు గుండెతో
స్వేదం చిందుతూ సేద్యం చేసే శ్రామికులు
విశ్వంలోని ప్రతీ పనికి
తమ శ్రమతో ప్రాణం పోసేవాళ్ళు
వారి జీవన సాగరంలో ఎగసిపడే
కష్టాల ఆలలను ప్రేమిస్తూ
కడవరకూ సాగే కష్టజీవులు
వారే తమ ఆయువు తీరేదాక ఆగక
పరిశ్రమించే కార్మికులు.....-
పక్కనవాడి శ్రమను దోచుకునే కార్మిక నీకు నీ కష్టానికి కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు...
ఏ జీతం ఇవ్వకపోయినా పక్కనవాడి జీవితం పై శ్రద్ధ చూపి వాళ్ళు తుమ్మినా దగ్గినా పది మందికి చెప్పే వాళ్ళకు మీ శ్రమకు కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు
నిజాయితీగా ఉండే వాళ్ళను నమ్మకుండా మాటలు చెప్పేవాళ్లను నమ్మే గొప్పవాళ్ళకి శ్రామిక దినోత్సవ శుభాకాంక్షలు...-
కార్మిక శక్తికి కరోనా
ఇచ్చెనువిశ్రాంతి
రెక్కాడని బతుకులు
డొక్కా నిండని అతుకులు
మెతుకు కోసంఆరాటం
ప్రాణం కోసంపోరాటం
వలసకార్మికుల విషవలయం
చేదించి స్వేచ్చారెక్కలతో ఎగిసే దెప్పుడో
ఆకలి మంటలు తీరే దెప్పుడో-
లేనోడి అవసరమే కదా
ఉన్నోడి అవకాశం
లేనోడి ఆకలి దప్పికలే కదా
ఉన్నొడి ఆస్తి పాస్తి
లేనోడి కష్టపడితేనే కదా
ఉన్నోడికి హోదా వచ్చేది
అదే అదునుగా చేసుకొని వాళ్ళని
ఎదగనివ్వకుండ వాళ్ళ కష్టాన్ని మాత్రమే
సొమ్ము చేసుకుంటున్నా పద్దతి మారాలని మనస్పూర్తిగా కోరుకుంటూ..!!!
శ్రమనే నమ్ముకున్న ప్రతి ఒక్క కార్మికుడికి
"మేడే శుభాకాంక్షలు"..!!!-
పట్టెడు అన్నం కోసం చేస్తున్న జీవన మజిలీలో పరిశ్రమలు కాలుష్య కారకాలవుతున్నాయి..!!!
"ఎంతైన లేనొడి అవసరమే కదా ఉన్నొడి ఆస్తి"-
కష్టమే సంతోషముగా... కష్టాన్ని జయించినందుకు
శ్రామికులకు,కార్మికులు అని పేరు తెచ్చిన రోజు
మే డే కార్మిక దినోత్సవం అని పిలవబడుతుంది.
కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులందరికి
కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు 💐💐🙏🙏-
ఆశ అంటే ఎలా వుంటది?
పండించిన పంటలు వరదల్లో
కొట్టుకుపోయినా..,వర్షించక
ఎండిపోయినా..ఆ భూమినే
నమ్ముకు బ్రతికే రైతన్న
నవ్వులా వుంటది.
శ్రమ అంటే ఎలా వుంటది?
నడ్డి విరిగేలా..కాళ్ళు పగిలేలా..
ఉత్పత్తి చేసిన సంపదంతా
గొప్పోళ్ళ బ్యాంకులలో సొమ్ములుగా
జమవుతున్నా..తన సాధనను
విడువని కార్మికుడి చెమట
చుక్కలా వుంటది.
గెలుపంటే ఎలా వుంటది?
మృగాల చేత హింసించబడినా
పశువాంఛలకు బలైపోయినా
యాసిడ్ దాడిలో బాధితలైనా
కన్నీటిని కసిగా మలచి
బ్రతుకు బావుటా ఎగురవేసే
స్త్రీ ఆత్మస్థైర్యంలా వుంటది.-
నా దేశ స్వాతంత్య్రానికి రక్తార్పన చేసి
నేను పొందిన స్వేచ్ఛ బానిసత్వం లో రాజ్యమేలుతుంది బలవంతుల భోగాలకు బాటలు వేస్తుంది.-