QUOTES ON #అబద్ధం

#అబద్ధం quotes

Trending | Latest
10 JUL 2020 AT 11:04

అబద్ధానికి ఆప్తులెక్కువ
ఆదరించేవారికెపుడూ
అందంగా కనిపించి
ఆకర్షిస్తుంటుంది

నిజానికి శత్రువులెక్కువ
నిలువ నీడను కూడా
తోడు కోరదు గనుక

-


28 MAY 2020 AT 6:15

అబద్ధాలు ఆగాధంలోకి తోస్తాయి,
నిజాలు నిలకడలేకుండా చేస్తాయి,
మనసుని ప్రశ్నలలో పడేస్తాయి..!
అబద్దాలు గాలిలో మేడలు
నిజాలు కూలిపోయే గోడలు
అర్థాలు, అంతరార్థాలే సమాధానాలు!!

-


31 JAN 2019 AT 20:41

అబద్ధాన్నే చెప్పాలంటే వంద దారులున్నాయి
కానీ, ఆ అబద్ధాన్ని ఆపాలంటే ఒక్కటే దారి...
నిజాన్ని చెప్పడం

-


28 OCT 2020 AT 19:22

"నిజంగా నిజం చెప్తే ఎవరికి నచ్చదు...
కానీ అబద్ధాని నిజంగా చూపిస్తే, ఆ అబద్ధమే నిజం అయిపోతుంది"
బహుశా దీని వల్లనేమో చెడు కూడా మంచి పనిలా కనిపించడం మొదలైంది....మంచిపనులు చెయ్యడం కరువైంది.

-


14 MAR 2019 AT 18:38

అబద్ధానికి అందం ఎక్కువ
నిజానికి సహనం తక్కువ
ఆ అందమైన అబద్ధాన్ని
ఎక్కువ కాలం ఉండనివ్వదు

-


5 MAR 2018 AT 9:14

కొన్నిసార్లు
అబద్దం పలకడం కన్నా
నిజం దాచడం మిన్న

-


5 JAN 2019 AT 20:58

"బ్రేకింగ్ న్యూస్"

నిజానికి
అబద్ధానికి
జరిగిన యుద్ధంలో
గెలిచిన అబద్ధానికి
హారతులు ఇవ్వడానికి
కొట్టుకొని చస్తున్న జనం.🤘

-


14 MAR 2018 AT 7:22

ఈ ప్రేమ ఎన్ని రోజులు
కలిసి తిరగడం....
కలిసి సహజీవనం...
కానీ
.
.
.
ఈ నిజంలో నిజం ఎంత
ఆ అబద్ధంలో అబద్ధం ఎంత

-


2 MAY 2021 AT 15:21

పనికిమాలిన విషయాన్నైనా
వినసొంపుగా చెబితే
నిజమేనని నమ్మేలా
మారింది ఈ లోకం...
వెన్నెల సతీష్...

-


7 JAN 2019 AT 16:57

ఒక్క ఐడియాతో
జీవితాలు
మారతాయో లేదో
తెలియదు కానీ....

ఒక్క అబద్ధంతో
మాత్రం మారిపోతాయి...


-