నా భారత మాత నుదుట ఈ నెత్తుటి మరకలు
అంటించిన ప్రతి చెయ్యి నరికి నివేదన ఇవ్వాలి.
మన కన్నీటిని చూసి నవ్వే ప్రతి ఒక్క ముఖం,
ఇక ఈ భూమి మీద నవ్వకూడదు.
అమాయకుల ప్రాణాలు తీసే ఏ దేశపు
సిద్ధాంతమైనా ఇక సమాధి కావాలి.
మతం పేరుతో హత్యల దారిని ఎంచుకున్న
ప్రతి కుక్కకీ ఇదే చివరి రోజు కావాలి.
మరిగే ఈ నెత్తుటి జ్వాలలే
వారి చితిని వెలిగించాలి.
జై హింద్!
-
One More year...!
ప్రేమమాత్రమే పంచడం తెలిసిన ఆ ఇద్దరు,
కష్టాలన్ని కలిసే దాటుతున్న ఆ ఇద్దరు,
పిల్లలంటే ప్రాణంగా ప్రేమించే ఆ ఇద్దరు,
ఒక్కటై ముప్పై సంవత్సరాలు అయ్యింది.
ఇదే ప్రేమ, ఇదే సంతోషం,
ఇదే బంధం, ఇదే అనుబంధం,
ఇంకొకటే కాదు, ఎన్నెన్నో సంవత్సరాలు,
ఇలా ప్రేమగా, చిరునవ్వుతో గడిపేయాలి.
♥️ హ్యాపీ యానివర్సరీ అమ్మ నాన్న ♥️-
A Letter to Myself - The End is a Beginning
ఏదో చేసేద్దాం, మారిపోదాం అనే intensionతో 2023 డిసెంబర్ 31st party చేసుకుని 2024కి Welcome చెప్పావు. ఏదైనా మారిందా? I mean, నువ్వు ఏమన్నా మారావా? అదే పాత ముచ్చట. Same repeat. ఈ 31st partyకి కూడా ready అయ్యావు మళ్లీ అదే పాత resolutionsతో. ఈ పనికిరాని circusను ఇప్పుడు మార్చే time వచ్చింది.
పోయేది ఏం లేదు. మళ్లీ మొదలుపెట్టు!
ఈ సారి నిజంగా మొదలుపెట్టు!!
మొదటినుంచే మొదలుపెట్టు!!!
Just give it a damn try. Financially, Mentally, Physically, and Emotionally ఒక్క step పైకి ఎక్కు. At least వచ్చే 2025 డిసెంబర్ 31stకి అయినా ఏదో positive change వచ్చింది అనే self-satisfactionతో జరుపుకో.
Just remember this one line:
"నీ Wishlistలో ఉన్నవి, నీ Order Historyలో కనిపించేంత వరకు కష్టపడు."
Happiest "YOUR" New Year, My Friend!-
Infinite Horizons
అవకాశాలు చూసే కంటికి సాకులు కనపడవు,
ప్రతీ ముగింపు నుంచి కొత్త మొదలు కనిపిస్తుంది.-
Time Stiched Together
గడుపుతున్న సమయమే నా గతాన్ని రేపటితో కలుపుతోంది-
The Beauty of Bindi
నీ కొంటె చూపుల మధ్య ఎర్రటి సిందూరం,
నా నయనాలకి కొత్త రూపాన్ని చూపింది.-
Unseen Connections
ఎక్కడ మొదలైందో తెలియదు కానీ,
చితి వరకు తోడుండే బుజం మాత్రం నీదే.-
Fleeting Moments.
గడిపినవి క్షణాలే కానీ,
గుర్తొస్తే రోజులు గడుస్తున్నాయి.-
Secret Santa - The art of giving
ఇవ్వడం ఒక రహస్యం, తీసుకోవడం ఒక ఆనందం
ఒక కళ నుంచి కలయికగా మారే ప్రయాణం.-
A Solitary Soul
అంతర్మధనమే అతి పెద్ద యుద్ధం,
గెలుపోటములను దాటే మార్పుల కోసం.-