amaterasu   (va nava)
1.7k Followers · 292 Following

read more
Joined 31 January 2018


read more
Joined 31 January 2018
31 JUL AT 9:36

The past is always present,
in memories unforgotten.

The future is never known,
in times uncertain.

And here we lie, in the present,
juggling between these two, to ourselves.

-


26 JUL AT 10:57

మదిలోని భావములు
సంద్రపు రీతిగా
ఎగిసి మనసుని తడుపు
కెరటమూ కవితయే

(Full piece in captions)

-


17 APR AT 21:09


కాటుక దిద్దిన కన్నుల మధ్యలొ
చూపుల కోలాటాలెన్నో
చాటుగ కలిసిన కనుదోయిలలో
చూపని ఆరాటాలెన్నో

-


8 APR AT 20:07

నీటి ముత్యం
=====================
ప్రాణం పోసే
అమృతమీ ముత్యం
పోయే ప్రాణమునకు
సాంత్వనయీ ముత్యం
జలధుల నుండి నభముల నిండి
నేలను జేరిన ఆణిముత్యం
=====================

ఇది నీటి ముత్యం

(Full piece in captions)

-


23 FEB AT 9:18

It is a fool's errand to look for luck.

-


22 FEB AT 8:17

జ్ఞాపకాల మేఘాలను
తరచి చూడ ఏమంది?
ఎద చాటున మాట ఒకటి
చెప్పమందువా అంది

మౌనంగా ఎద నేడు
మాటలాడుతానంది
పాత గాయమేదొ ఒకటి
ఇంక సెలవు అంటోంది

మెరుపులేదు ఉరుములేదు
వర్ష సూచనేది లేదు
కనుదోయిలొ ప్రళయమేదొ
రుధిర వర్ణమలుముకుంది

కంటి వెంట అశృధార
ఉద్ధతిగను పొంగుచుండ
భారమొకటి తగ్గెనంటు
మనసు కుదిట పడుతోంది

-


19 FEB AT 7:50

అందాలొలికే చక్కని బాల్యం
దక్కకనెక్కడొ దాగింది
పగిలిన గుండె పదిలం కాదని
ఆనందం ఎడబాసింది
మనసుని తొలిచే అనుభవ-అమ్ములు
తలపుల పొదలో చేరాయి
కదిలే కాలం తనకై తోడుగ
బంధాలను తోడ్కొనిపోయింది

పాడని శైశవ గీతికలు
దక్కని ఆ ఆనందాలు
చేదగు అనుభవ జ్ఞాపికలు
దూరమైన బంధాలు
మలిచెను నను ఓనాడు
జవము లేని శిలగాను

-


17 FEB AT 23:29

3. గుండెనెల్ల పిండేస్తూ
ఊపిరి పోతున్నా
అలసిన మది నాకిది
బాధ కాదులే అంది

4. బాధలేను ఆభరణం
ఎంతటి మనిషికైనా
కష్టాలను ఎదురీదక
కాష్టం లేదని అంది

-


12 FEB AT 11:47

కలువవోలే కన్నులున్నది
వెన్నెలను మించిన వన్నెలున్నది
ఉదయ భానుని అరుణ వర్ణము
తన సొట్టబుగ్గన కలది నా చెలి
కడలి అలలా కురులు ఉన్నది
చిలుక పలుకుల చిలుక తానని
రామ చిలుకలకు నీ జాడ తెలిపి
పంపినానే కబురు చెప్పమని

(Full Piece in Captions)

-


23 JAN AT 7:26

Trains are fascinating. A car attached to a car attached to a car attached to a ca....

When you try to walk it off, all those cars, you realise, it is big... bigger than what you would have imagined it to be initially.. but eventually, you will walk it off at some point and then you know, it ends, after all like everything else.

When it moves off from the platform, slowly but surely, you feel as if it is you who is moving, not the train... for it has been standing still there and you thought it would stay there forever... but eventually, as it gathers pace, the illusion wears off and you realise, it's time for it to move on.. and that it is time for some other train now to take its place...

-


Fetching amaterasu Quotes