Sri Harshitha   (Harshi)
1.0k Followers · 76 Following

Joined 22 April 2018


Joined 22 April 2018
20 JAN 2022 AT 18:05

అటు వైపు నుండో చెయ్యొచ్చి
ఇటు వైపునున్న నన్ను లాగుకుపోవాలని చూస్తోంది
సరే సరే అనుకుని పోదాం అనుకున్నా
ఇటు వైపు నన్ను చుట్టుకున్న ధారాలూ
గాయాలైనా చేస్తున్నాయే కానీ కదలనివ్వడం లేదు
ఆ చెయ్యి పట్టు వదిలి విడిచిపోవడమూ లేదు
రోజులు గడుస్తున్నాయి, ఋతువులు మారుతున్నాయి
ఆడిచిపెట్టిన వూపిరితో ఆకులు రాలుతున్నాయి
నేను మాత్రం కదలలేదు
నన్ను చుట్టుకున్న ధారాలకీ
నన్ను పొంచివున్న ఆ చేతికీ
మధ్య పడి నలుగుతూనే ఉన్నా
ఎటూ తేల్చుకోలేక దిగులుతోనే ఉన్నా
ఇరువురినీ ఒప్పించలేక రగులుతూనే ఉన్నా
అకస్మాత్తుగా ఒకరోజు
గడియారంలో ముళ్ళులు కలిసాయి
ఒక్కటిగా కత్తెరలయ్యాయి
ధారాలు తెగిపడిపోయాయి
నీరసించి క్రిందకు రాలిపోయాయి
ఆ చెయ్యి ఒక్కసారిగా నన్ను లాగుకుపోయింది
అటువైపుకు
ఇటువైపు నన్ను హత్తుకున్న ధారాలకి
ఏమవుతుందో తెలుసుకోలేని
అటువైపుకు
అటువైపునుండి మాట్లాడితే
ఇటువైపుకు
ఏది ఏ వైపో తెలుసుకోలేని
ఆ వైపుకు
-Sri Harshitha

-


22 SEP 2019 AT 11:26

I speak two languages.
One
For me to understand.
The other
For me to be understood.
One innate. The other acquired.
The former is the bridge
Between me
And the world inside me.
The latter is the bridge
Between me
And the world outside.

-


16 JAN 2022 AT 16:19

నన్ను చూసి..

[Story in caption]

-


20 DEC 2021 AT 10:03

Knowing why
Makes all the difference
In hell and heaven

-


8 DEC 2021 AT 10:05

ఈ విశాల భువనంలో
నీకంటూ ఉనికేదీ?
ఈ అనంత విశ్వంలో
నీ ఉనికికి రుజువేదీ?

[Full Piece in the Caption]

-


5 DEC 2021 AT 17:25

రాలుతున్న చినుకుల్లా విరిగిపోవు జ్ఞాపకాలు
కిందపడ్డ కెరటాల్లా అతికిపోవు జ్ఞాపకాలు

యే సిరాను వాడారో తెలియదు ఆ బ్రహ్మగారు
చేతి మీద గీతల్లా చెరిగిపోవు జ్ఞాపకాలు

రేపటికీ నేడు నిన్న, మనసు రంగు మారలేదు
కొత్తదనపు బూజుపట్టి వెలిసిపోవు జ్ఞాపకాలు

గుచ్చుకున్న మెచ్చుకున్న రోజాపువ్వొకటేలే
నాణేనికొ నాణెమంటు చెల్లిపోవు జ్ఞాపకాలు

జ్ఞాపకాల మెప్పుకనా? రాస్తున్నావ్ శ్రీహర్షిత
నీ రాతల మధ్యపడీ నలిగిపోవు జ్ఞాపకాలు

-


11 NOV 2021 AT 21:19

అమ్మ చేయి దూరలేని పంజరమా బ్రతుకంటే?
గోరుముద్దనడ్డేసే పంజరమా బ్రతుకంటే?

సూత్రధారి దేవుడికీ పాత్రలంటె చిన్నచూపు
పాక్షికమై నడుస్తున్న నాటకమా బ్రతుకంటే?

యే జన్మలొ పాపాలో ఈ జన్మలొ శాపాలై
కీలుబొమ్మలా నడిపే భూటకమా బ్రతుకంటే?

అక్షరాల నిచ్చెనేసి ఎదగాలని అనుకున్నా
ఎత్తులేవి గెలవలేని కుతంత్రమా బ్రతుకంటే?

ఆడతనం వరము కాదు పేదతనం తోడయితే
శ్రీకృష్ణుడి అండలేని భారతమా బ్రతుకంటే?

పడితేనే తెలుస్తుంద దెబ్బ నొప్పి ఏంటన్నది
స్పందించని మరమనుషుల సంగమమా బ్రతుకంటే?

నవ్వులేమి చౌకకాదు తెలుసా? ఓ శ్రీహర్షిత!
వెలసిపోవు జ్ఞాపకాల నా గతమా బ్రతుకంటే?

-


5 NOV 2021 AT 18:28

మునుపు క్షణపు ముళ్లపొదను మరిచానూ నిన్ను చూసి
ఎడబాటుపు ఎదబరువును మరిచానూ నిన్ను చూసి

ప్రతి గాలిలొ పరిమళాన్ని ఓ కబురే అనుకుంటూ
నీ ఊపిరి మత్తుల్లో మునిగానూ నిన్ను చూసి

కళలున్నా కలలుకనక  రాయినయ్యి మిగిలానూ
మారిన ఓ అహల్యనై కదిలానూ నిన్ను చూసి

సంద్రమిలా కలవగానె చినుకు ఉనికి చినబోయే
నన్ను నేను దాచుకోక కురిసానూ నిన్ను చూసి

శ్రీహర్షిత కలంలోని సిరాకింక చోటులేదు
నువు దిద్దిన కాటుకతో వ్రాసానూ నిన్ను చూసి

-


10 JUL 2021 AT 18:58

అక్షర మూలం
[క్యాప్షన్లో]

-


6 JUL 2021 AT 12:30

ఆగిపోవాలనుకునే అడుగు
ఎంత పయనిస్తే ఏముంది..!
కృంగిపోతాననుకునే మనసు
ఎంత పోరాడినా ఏముంది..!

ఒదగాలని తెలియనపుడు
ఎంత ఎదిగితే ఏముంది..!
కురవాలనుకోనపుడు
చినుకుకేం విలువుంది..!

పరిగెత్తే కాలానికే తెలుసు..
అలసిపోయి ఓ గడియ
ఆగాలనుకుంటే ఆదరణ ఉండదని!
నింగికెగిరే అలకే తెలుసు..
ఓ క్షణం పాదాన్ని తాకినంత మాత్రాన్న
కబళించే శక్తిని తానేం కోల్పోదని!

-


Fetching Sri Harshitha Quotes