అవసరం తీరాకా అనాధల్ని చేస్తూ
బాధ్యత మరిచి వృద్ధాశ్రమాలకి పంపేస్తూ
అమ్మ పెట్టిన గోరుముద్దలు మరిచావా
నాన్న నేర్పిన నడకను మరిచవా
అడగక ముందే అన్ని ఇచ్చే ఆరాటం మరిచవా
నీ ఆనందమే ముఖ్యం అనుకున్న ప్రేమని మరిచావా
నీ భవిష్యత్తుకై పడినవారి కష్టం మరిచావా
నిన్ను ఇలా నిలబెట్టిన గతం మరిచావా
నువ్వు వర్తమానంలో మిగిలిపోవు
జీవితం నువ్వు ఇచ్చినవన్నే తిరిగి ఇస్తుంది అని మరవకు
నువ్వు నీ తల్లితండ్రులకు ఇచ్చిన కానుక
నీకు తిరిగి నీ పిల్లల నుండి వస్తుంది.-
ఒరేయ్ నాన్నా...
నువ్వు ఎదిగిన తరువాత నాకు ఒక పని చేసిపెట్టరా..
ఆఆ...
నీ సంపాదన వద్దు ,నీ ఆస్తిపాస్తులు అడగను
వారానికో, నెలకో ఒక సారి ఎలా ఉన్నావు అని బాగోగులు అడిగితే చాలు రా
ఈ శేష జీవితానికి అంతే...
అడుగుతావు కదూ....-
యువ్వనంలో అందాలను చూసి ఎవరైనా ప్రేమిస్తారు, కానీ వృద్ధాప్యంలో కూడా చూసి ఆరాధించేవాడే,
నిజమైన ప్రేమికుడు.-
ఆమెకి కొడుకంటే
అమితమైన ప్రేమ
అనంతమైన నమ్మకం
అదే నమ్మకంతో తిరిగి వస్తాడని
ఎదురుచూస్తుంది,
పాపం ఆ పిచ్చి తల్లికి ఏం తెలుసు రావడానికి వదిలి వెళ్ళలేదు వదిలించుకొని వెళ్ళాడని..!!!-
చిరు మువ్వలు
చిరు నవ్వులు
చిరు మొలకలు
చిరు చిలకలు
'ప్రేమలో' వారే
ఒకరికొకరు 'వృద్దాప్యంలో'-
వృద్ధాప్యం శాపంగా మారకుండా ఉండాలంటే
ప్రతి ఒక్కరికి 50 సంవత్సరాల ఆయుర్ధాయమే ఇవ్వాలి ఆ దేవుడు.
...✍️వెన్నెల సీత
-
వృద్ధాప్యం కాదు నిర్వీర్యం
కురిపించును జ్ఞాన ప్రసూన సౌరభం
తలచకండి వారిని నిష్ప్రయోజన జనమని
ఎఱగండి వారులేనిదే మీరు లేరని
తలిదండ్రులె ప్రత్యక్ష దైవాలు
భక్తిప్రపత్తులతో కొలవండి
వారి అనుగ్రహ దీవెనలు పొందండి
సాగుతుంది మీ జీవితం నిర్విఘ్నంగా
వారు మీతో కలిసుంటే
సుతులు నెరవేర్చాలి తమ ధర్మం
అదె మానవ జాతికి విధాయకం-