జ్ఞాపకాల గాటు మైళ్ళ దూరంలో ఉన్నా గాఢంగా ఉన్నాయి
వ్యక్తుల ప్రభావమో ,అనుభూతుల ప్రభావమో మరి-
Aspired to ... read more
నా రాతలలో అక్షరం అయి చూడు
కారు మబ్బులు కమ్మేద్ధాం అనుకున్న
సాయం ఎరుగని సూరీడు జ్వలిస్తా అంటున్న
సందె వేల సందమామ దాగుడుమూతలు ఆడుతున్న
నిలకడ గా నిల్చున్న నింగికి సరి సాటిగా
నిలువెల్లా నీ వెంటే కాపు కాస్తుంటా
-
మదిలో అలజడి మొదలైంది
తప్పు ఒప్పుల సంఘర్షణ లో పడింది
ఈ అకాల పెను తుఫానుకు
మూలం ఎవరైనా ఏదైనా
మూల్యం మాత్రం నేనే చెల్లిస్తున్న
-
పిల్ల కాలువ లో ఒంటరి ప్రయాణం మొదలైంది
ఎన్నో మచిలీలు మజిలీలు అయ్యాయి
ఆ మచిలీలు వలలో పడ్డాయో సంద్రానికి చేరాయో
ఈ ప్రయాణం మళ్ళీ ఒంటరి అయ్యింది-
గగన్నాన్ని ఘనంగా చూసిన కళ్ళు
వాతావరణ పరివర్తన అనుకున్నాయి
ఆలోచనా పరివర్తన అని తెలియక
-
Learning to get habituated to send the people off from the life
-
కంటికి కనిపించ ని బంధం కోసం
ఎడ తెరపు లేని ఎదురు చూపులు
అడుగంటని అహానికి ఆనకట్టులు
దిక్కు తోచని ఏకాంతాలు
భరించలేని భాధలు
ఊహించని ఆనందాలు
ఇదేనేమో బంధం అంటే-