31 DEC 2024 AT 8:30

కొత్త చెప్పు లేసుకున్న నడపు పాతదేగా
కాటుకెంత రాసుకున్న చూపు పాతదేగా
కొత్తదనం ఏమున్నది గతమే నేడైతే
వత్సరాలు వస్తున్నా బ్రతుకు పాతదేగా
31/12/2024

-


8 NOV 2024 AT 18:47

జీవన నడక ఆగిన ప్రతీసారీ
ప్రేరణ నిచ్చి నన్ను కదిలించే శక్తి నువ్వు

-


20 SEP 2024 AT 14:40

ప్రవర్తన దాగుంటుంది నడకల్లో
సామర్థ్యం తెలిసిపోతుంది చేతల్లో
ఎంత యత్నించినా దాచలేవు సుమా
హృదయం బయలౌతుంది మాటల్లో
20/09/2024

-


13 AUG 2024 AT 7:59

కను రెప్పలు
వాలవు
కనుల కాంక్ష
తీరదు

తానొక తొలి కిరణం
తళుకులీను ఆభరణం
13/08/2024

-


25 JUL 2024 AT 9:39

అలవాట్లే ఉదయంలో
పొరపాట్లే కర్మల్లో
మగత వీడ లేనప్పుడు..
అగచాట్లే లోకంలో
25/07/2024

-


27 MAY 2024 AT 9:38

స్వర్గమెక్కడొ ఉందంటే
అవగాహన లేదంటే
జీవన మధురామృతం
అందదులే నీకంతే
27/05/2024

-


30 MAR 2024 AT 21:04

ఆవేశం కాదు ఆర్ష సంస్కృతి
ఆక్రమణం కాదు ఆర్ష సంస్కృతి
శాంతి త్యాగ మేది లేని వట్టి
కాషాయం కాదు ఆర్ష సంస్కృతి
30/03/2024

-


26 NOV 2023 AT 21:49

లేదు మందూ ముక్క
బరిని గెలుచుట పక్క
జై జై బర్రెలక్క
ఓ కూనలమ్మ.!
26/11/2023

-


6 NOV 2023 AT 11:59

మట్టిలోంచి మెళ్ళిగా
తల ఎత్తి చూసిన
చిట్టి మొలక
నేలంతా విస్తరిస్తుంది


శూన్యం నుంచే
పూర్ణానికి ప్రస్తానం
06/11/2023

-


19 SEP 2023 AT 14:12

మతాలేవో ఖండించుట కామన కాదు
గురువులనే ఓడించుట యోచన కాదు
సత్యానికి పీఠ వేయు శంకర యతికి
అధర్మాలు ఎప్పుడు ఆమోదన కాదు
19/09/2023

-


Fetching Naresh Reddy Aleti Quotes