రక్తం ఒలకని ఛాయలే గుండె పగుళ్ల గాయాలు..!
కనిపించని కన్నీళ్ళే కానరాని శోకాలు..!
వినిపించని విన్నపాలే విషపూరిత విషయాలు..!-
నా ఆస్తి మా అమ్మ గర్భం
ఎందుకంటె నేను పుట్టింది
పెరిగింది అక్కడే కాబట్టి..
మల్లెల మందహాసానికీ
గులాబీల గుండే గుబులు
కొప్పులో గుప్పుమన్నా
తన శ్వేత సొగసరికి
ఒక్కో జ్ఞాపకం ఒక్కో గులాబీ రేకులుగా భూమిని తాకి బోరున విలపించాయి..-
కళ్లకిటికీ తెరిచి నీవు చూస్తున్నా ఆనందం
నా తలుపులలో నిద్రనటు తోస్తున్నా ఆనందం
ఏడడుగులు నడవాలని మనసుకెంత ఆత్రమో
కాసేపు కలిసి అడుగులు వేస్తున్నా ఆనందం
నా పేరును నీ నోటగ.. నే నస్సలు వినలేదు
సరదాగా ఒక్కసారి రాస్తున్నా ఆనందం
నే చూసిన వెంటనే మూతి తిప్పుకుంటావే
ముసిముసి నవ్వుల నవ్వుని దాస్తున్నా ఆనందం
కాస్తైనా నీ ప్రేమను పంచిపెట్టు ఓ చెలియా
చురకత్తితో " జై " మనసు కోస్తున్నా ఆనందం..-
ప్రాణాలు రాసిస్తా నీ నవ్వుని నాకిచ్చేయ్..
ప్రేమను పుట్టిస్తా నీ నవ్వుని నాకిచ్చేయ్..
లోకంలో చీకటంతా చుట్టములా చేరువైంది
దీపాన్ని ముట్టిస్తా నీ నవ్వుని నాకిచ్చేయ్..
ఖరీదు ఎంతైనా సంకోచించను చెప్పు
ఆస్తంతా అమ్మేస్తా నీ నవ్వుని నాకిచ్చేయ్..
ప్రతీరోజు ఏదో తెలియని అసంతృప్తి
హృదయాన్ని వడ్డీస్తా నీ నవ్వుని నాకిచ్చేయ్..
ఈ ప్రేమ దేవతకి జీవితాంతం భక్తుడిగా ఉంటా
ఓ గుడిని కట్టీస్తా నీ నవ్వుని నాకిచ్చేయ్..-
అమ్మ జోలపాట పాడి
చందమామను రా అని, పిలిచినట్టే వచ్చి
వాలిపోయింది ఓ దిగులు
రెక్కలు లేకున్నా చుక్కల దివికి
ఎగరేసుక పోతనంటూ ధీమాతో
పని కట్టుకొని పలకరించినట్టుగా
నా పగిలిన గుండె పలకని కేకలకు
నిదుర చెదిరిపోయినట్టుగా
అణువణువు అల్లుకుపోతోంది ముళ్ళ తీగలాగా
ఎందుకని నన్ను ప్రశ్నిస్తే..?
తెల్లార్లు చదివిన ఉదయం పరీక్షలో
రాయని సమాధానంలాగే మిగిలిపోతున్న...-
"Wonder Woman"
ఆమె మనస్సు ముమ్మాటికీ బండరాయే
ప్రేమ ఉలితో చెదిరిపోలేని విధంగా
చెక్కుకుంది తనలో నన్ను
అలసిపోయిన ప్రతీసారి ఆమె భుజం పై
వాలితే చిటారు కొమ్మపై వాలిన పక్షిలా ఆనందం
ఆ భుజంపై వాలిపోవడానికైన కొన్ని
కన్నీళ్ళు వెంట పెట్టుకోవడం తప్పు లేదు
వర్ణించలేని హాయి కలుగుతుంది మరి
ఆమె కన్నీళ్ళు తుడువడానికి
నేను నాన్ననై పోతాను
ఒడిలో జో కొడుతూ తను అమ్మై పోతుంది
భూదేవికున్న ఓర్పు తనలోనే చూశాను
అలా అని చేతులు కట్టుకొని కూర్చోదు
కాళీ కళ్లు తెరవనంత వరకే ఆ ఓర్పు
ఆమె ప్రేమ సముద్రం అందుకే
నా బాధలను అక్కడే విసిరెస్తుంటాను
మళ్ళీ ఎదురు పడలేవు కదా అని
" మహిళా దినోత్సవ శుభాకాంక్షలు సర్రు "
" Happy Women's Day Sarru " 🫅♥️-
ఎన్ని కన్నీళ్లు ఆమెకు
బాధలకు సరిపడా
కన్నీళ్ళు ఇచ్చాడు దేవుడు,
కానీ ఎంతకు ఆ బాధ తేలిక కాదే,
ఎందుకల అని మొండిగా ప్రశ్నిస్తే ..?
నా కళ్ళు నిండుగా సమాధానం ఇచ్చాయి ...-