QUOTES ON #విరిసినవిరులు

#విరిసినవిరులు quotes

Trending | Latest


విరిసిన విరుల కొలువు...
కనువిందు కీ నెలవై

-


5 JUL 2021 AT 14:52


పరవశించిన తుమ్మెదలు
పులకరించిన పక్షులు
ముసిరిన మబ్బులు మెరిసిన మేఘాలు
కురిసిన ముత్యపు చినుకులు
తడిచిన విరుల అధరాలు
పొంగిన మకరంద ప్రవాహాలు
పెనవేసుకున్న వలపు శిరోజాలు
ఉప్పొంగిన తమకపు విరహాలు
విరిసిన చిరునవ్వుల మధువులు
వరించిన విరుల సుగంధ పరిమళాలు
తరించిన ప్రకృతి ప్రణయాలు

-


10 OCT 2019 AT 8:55

వసంతకాలాన మది తలపులు...
చల్లని మలయ సమీరాలు...
కనులను పలకరించే విరుల నవ్వులు...
కాలాన్ని సంతసంతో గడపమని తెలిపే సందేశాలు...

-


5 JUL 2021 AT 17:35

కురిసే జల్లులు
అందమైన గాలి తెరలు
నన్ను మైమరిపించే తీరాలు

-




అందాల భరితంగా
అందమైన పడతి.
సిగలో...

-




మనసుకీ చక్కటి ఆహ్లాదకరంగా...

-


10 OCT 2019 AT 19:30

నను తాకే చూపులు
నను చేరే నవ్వులు
తెలుపుతాయి మనసులు
తెలుస్తాయి కథలు
సవ్వడి చేయని సరిగమలు
చూస్తే చాలు మైమరపులు
ఎన్ని రంగులో కళ్ళముందు
కలలు ఏవో కదలాడుతున్నట్లు
కలల్లోతేలిపోతున్నట్లు
ఆనందమంతా ఒక్కచోటే ఉన్నట్లు

-


10 OCT 2019 AT 8:48

అందంగా విరిసిన పువ్వు
నన్ను లాగింది నీ వైపుకు నీ నవ్వు
నీ సౌందర్యం నా కళ్ళను వంశం చేసుకుంది
నీ సౌగంధం నా హృదయాన్ని మైమరపించింది.

మొగ్గుగా నీ మదిలో నీ వడిలొ
ఎన్నో భావాలు ఎన్నెన్నో అనుభూతులు
విరిసి నవ్వుతుంటె నన్ను పలకరించినట్టుంది
విరిసిన రేకులు నాకో సందేశం రవానిస్తున్నట్టుంది

భూతకాలాన్ని నిన్నటి రోజులొ దాచివేయి
భవిష్యత్తును రేపటి రోజే ఆహ్వానించు
ఈ వర్తమానం మాత్రం నిజంగా నీదే
నాల హాయిగా జీవించు,నవ్వుతూ నవ్వించు.

-


11 OCT 2019 AT 2:10

నా మదిని తాకిన వేళ జ్ఞాపకాల పోదలు

నా ఎదలో కలిగే భావాలే విరులు,

మదిని తాకిన మనసు నీదే కదా...!!!

-


10 OCT 2019 AT 16:16

విరిసిన విరులను
కురుల్లో తురిమి
సిగ్గుల మొగ్గలా
ఎదుట నిలిచిన
ఆమెను చూసిన
కలిగెను మదిలో
కొంటె తలపులు

-