The value of togetherness
can't be defined in words-
జ్వలించెఁ అంతరంగం మండే సూర్యునివోలె
ఉప్పొంగె నయనం కడలి కెరటమొలె
అయినవారే వెన్నుపోటుకు పాల్పడంగఁ
అంతులేని వేదనతో రగిలిపోయే రుధిరం-
నా హృదయాన నీ రూపు
నా కళ్ళలో నీ చూపు
నా పెదవులపై నీ నవ్వు
నా మనసే నిండెను నువ్వు-
అమ్మా ,
నీ అనురాగపు ఉప్పెనలో
నను పెంచి పెద్ద చేస్తే
నీ ప్రేమ అల గా
ఉండాల్సిన నేనే
అతి పెద్ద సుడిగుండంగా మారి
నిన్నే కబళించి
మింగేసాను కదమ్మా
అయినా నా పై ఇంకా
అదే ప్రేమానురాగం
ఎందుకు కురిపిస్తున్నావమ్మా !
- Anamika-
విరిసీ విరియని
ఆమె పెదవులు
నా ప్రేమను అగీకరించినట్టా లేక
తగు సమయం కావాలని నను కోరినట్టా లేక
తనకు నేను సరికాదని చెప్పినట్టా
అర్థంకాని అయోమయంలో నను పడేసి
వెళ్లిపోయిందామె మెల్లగా
తొణకని కుండలా-
నా అణువణువూ నువు చుంబిస్తున్న భావన
నువు నాతో లేకున్నా
నా తనువంతా మైమరపుతో పులకిస్తున్న భావన
నీతో నేనున్నట్టుగా-
నా పోరాటం నా మదిలో మెదిలే భావాలపై
అక్షరాలుగా మార్చి పదాలుగా కూర్చి
కాగితంలో ఇమిడిపోయేవరకు
నను వదిలిపెట్టకుండా
క్షణం వీడిపోకుండా
అలసట తీసుకోకుండా
నన్ను రగిలించే వాటి తీరుపై
నా మది చేసే కవన పోరాటం-
జనన మరణాల నడుమ ఈ జీవన గమనం
ఏదీ శాశ్వతం కాదని తెలిసినా అన్నిటికై ఆరాటం
ఏదీ నిక్కము కాదని అనిపించినా ఎడతెరిపి లేని పోరాటం-
చందమామనే నా చేతికివ్వాలని నీ ఆశ
నువ్వే నా చందమామని నీకు తెలుసా-
మనసుల కలయికతో
మమతల అల్లికనై
అల్లుకుపోనా నీ జత
మాటల కలయికతో
అనురాగపు వల్లికనై
పలుకనా నీ మాట
చేతుల కలయికతో
స్నేహపు గీతికనై
తోడురానా నీ వెంట
పదముల కలయికతో
సప్తపది వేడుకనై
కలసిరానా కడ దాకా-