మౌనంతో చేస్తున్న యుద్ధాన్ని,
నా మాటలతో ముగించి,
తన కళ్ళు వెతుకుతున్న సమాధానానికి,
నా నవ్వులు కానుకిచ్చా.....-
నా మనసే ఓ యుద్ధభూమి
నా ఆలోచనే నా ఆయుధం
నా ప్రవర్తనే నీకు బెదిరింపు
నా సహనమే నాకు గిరి
సహనం నశించి గిరి దాటానో
నా మౌనం కూడా పదునైన
కత్తిలా మారి నీ గుండె చీలుస్తుంది-
నీ మాటల్ని భరిస్తున్నారంటే
నువ్వంటే ఇష్టమని
నువ్వు ముఖ్యమని
నీ మౌనాన్ని కూడా భరిస్తున్నారంటే
నువ్వంటే ప్రేమని
నువ్వు మాత్రమే ముఖ్యమని-
చేసిన మంచిని చెప్పని మౌనం గొప్పదా?
తప్పులు దాచే టక్కరి మౌనం చిక్కదా?
మనసుల మౌనం మాటల దూరం పెంచునా?
మాటల మౌనం మనుషుల మార్గం మార్చునా?
శక్తుల మౌనమే దుష్టుల ధైర్యమా?
లేక నేటి మౌనమే రేపటి సమాధానమా?
-
ప్రతిసారీ నా మనసు చేరే దారి మౌనమే
ఎప్పుడు ఏ ప్రశ్న పుడుతుందో తెలియక
ఆ ప్రశ్నలకు బదులెక్కడ వెతకాలో తోచక-
మౌనమే నా ఆయుధంగా ఉంటే
ప్రతి సారి కూడా మౌనంగా ఉంటాను
కాని మౌనం ఎప్పుడు మన ఆయుధం కాదు
కొన్ని సార్లు మన మౌనమే మా ఓటమికి కారణం,
నా మాటలే నా ఆయుధం
నా ఆలోచన నా ఆయుధం
నా పరిశ్రమ నా ఆయుధం
నేనే నాకు ఒక ఆయుధం.-
సహనమే నా కవచంగా
స్థిర సంకల్పమే నా సైన్యంగా
సాగిస్తున్నా సమరం
అంతః శత్రువులతో అనుక్షణం.
-
యుగ యుగాలుగా గెలుస్తున్నాను
నా గెలుపుని అస్తిత్వాన్ని గమనించక
నను వెతుకుతూ నిరాశపడినవారు కొందరు
నేను లేనంటూ వాదించేవారు మరికొందరు
నను ఓడించానని విర్రవీగే అభాగ్యులు ఇంకొందరు.
నను మరెక్కడో వెతకడం మాని
మీలో అణువణువు నింపుకుని
ముందుకు సాగండి నేనొక నిత్య యాగాన్ని
ఏది 'ధర్మం' అంటూ నాకోసం ఎవరినో ప్రశ్నించక
ప్రతి మనిషి ఆచరించాలి మానవ ధర్మం.
-
మలిచానిక్కడ
నా మాటకు విలువిస్తారు గనుక
మాటలే అస్త్రాలుగా
సంధిoచానక్కడ
మౌనాన్ని చేతకాని తనంగా చూస్తారు గనుక-