మనిషికి మెషిన్ కి తేడా
అక్షరాల్లోనే మిగిలిపోయింది!!-
నా ప్రశ్నలే నా పదాలు
చెప్పుకోవడానికి చాలా కథలు ఉన్న
చెప్పాలని చాలా కలలున్నా
వినే మనిషి స్పందించే మనసు లేనప్పుడు
చుట్టూ జనం ఉన్న కనిపించే శూన్యమే ఒంటరితనం
చుట్టూ పండగ అయినా వేధించే ప్రశ్నలే
ఒంటరి వైనం-
తను ఎదురుగా ఉన్నప్పుడు అర్థం కాని ప్రేమ
తను దూరమయ్యాక అర్థమైంది
గమ్యం ఉన్నప్పుడు గుర్తించలేదు
గాయం అయ్యాక చేరువయ్య మార్గమే లేదు
-
ఒంటరిగా ఆనందించే నవ్వులో ఒక నిజాయితీ ఉంటుందని
ఒంటరిగా బాధపడే కష్టంలో ఒక నిజం ఉంటుందని
ఈ రోజు ఎందుకో అనిపించింది...
-
నీ కథలు కలలు అవసరం లేదు ఈ లోకానికి
జయించి చూపించు
అదే వెతుక్కుంటూ వస్తుంది నిన్ను వినడానికి
-
లోకం తెలిసేలోపే మారిపోతుంది తనలోకం
లోకం విడిచే వరకు మారదు తన ఉద్యోగం
-
అవనిపై అడుగు మోపింది మొదలు
అల్లరికి హద్దు, ఆనందానికి హద్దు,చదువుకి హద్దు,చనువుకి హద్దు
ఏదైనా అడగాలంటే భయం, ఎక్కడికైనా వెళ్లాలంటే భయం
విడిచిన ఇష్టాలెన్నో, పిలవని కష్టాలెన్నో
లోకం తెలిసేలోపే మారిపోతుంది తనలోకం
లోకం విడిచే వరకు మారదు తన ఉద్యోగం
నెలలు మోసి కంటుంది నిన్ను,నువ్వు ఏడిస్తే తడిసెను తన కన్ను
నీకు ఊహ తెలిసినంతవరకు అన్ని తానై చూసుకున్న అమ్మకు
నువ్వు ఎదిగి చూపించే కోపం చిరాకు కూడా ప్రేమే తనకు
తన ఇష్ట కష్టాలు తెలియని నీకు, కష్టం వస్తే మొదట గుర్తొచ్చేది తానే
అందరి కోసం అన్ని వదులుకొని తన కోసం ఏమీ కోరని
అమ్మ కన్నా గొప్ప ఎవరు
ఆమె కన్నా ప్రేమ ఎవరు-
కొన్ని భావాలు వ్యక్తపరచలేము
వ్యక్తిగతంగా అనుభవించడం తప్ప
బాధైనా, సంతోషమైన!!
-