QUOTES ON #ప్రాణం

#ప్రాణం quotes

Trending | Latest
17 MAY 2020 AT 0:42

నీ వెళ్ళిన దారులలో
నా పయనం మొదలయ్యింది
వాలిన సంధ్యలలో
అగ్నిపూవు జ్వలించింది

-


10 JUL 2020 AT 0:08

ఒక్కోసారి నిర్లక్ష్యం ఖరీదు
నిండు ప్రాణాలు
దయచేసి నిర్లక్ష్యంగా ఉండకండి
నిండు ప్రాణాలు తీయకండి
తీసుకోకండి

-


27 APR 2019 AT 9:50

ఈ క్షణమే ఓ మహా కల్పం...

ఈ హృదయం విషాద తల్పం...

ఈ ప్రాణం అత్యంత అల్పం...

ఈ దేహం పురాతన శిల్పం...

-


2 JUL 2019 AT 23:58

గుర్తుచేస్కుంటే గాని తెలీడం లేదు
నేనింకా బ్రతికే ఉన్నానని
నాక్కూడా ప్రాణముందని
నాక్కూడా‌ గుండె లాంటిదొకటుండి
కాస్తో కూస్తో కొట్టుకోడానికి
ప్రయత్నిస్తుందని
హ హ హ చిత్రంగా ఉంది.
జీవచ్ఛవంలా బ్రతుకుతున్నాగా
ప్రాణంపై అభిమతం చచ్చిందేమో
గుండె పగిలిన ముక్కల వాడికి
గాయాల పాలవుతున్నాగా
బహుశా అందుకే అది కొట్టుకుంటున్న
శబ్ధం పెడచెవిన పెట్టానేమో
విధానమేదైనా విధిని శాసించలేకుంది
నా విధిని ఏమార్చలేకుంది.

-


22 MAY 2019 AT 23:21

పొంతన కుదరని మనస్తత్వాలు
చిందర వందర జీవితాలు
చిదిమేయబడ్డ మనసాంతరంగాలు
పరిష్కారమే చేతులెత్తేసే మలుపులు
ప్రాణాన్ని వేలమేసే పరిస్థితులు
కొనలేమని తెలిసినా ప్రాకులాడే ఆశాపాచికలు

-


5 JUN 2020 AT 13:24

శిల వంటి హృదయం
ఉలిదెబ్బలు తగిలి
శిల్పముగా మారెను
కానీ ప్రాణమునే విడిచెను

-


14 APR 2018 AT 15:24

నిన్ను చూడగానే మనసుపడ్డా...!
జీవితా౦త౦ కలిసి నడవాలని ఆశపడ్డా....!
నన్ను కాదనుకుని వెళ్తే మధనపడ్డా.....!
చివరికి నా ప్రాణాలు విడవడానికే సిద్ధపడ్డా....!
అసలు ఎ౦దుకు ప్రేమలోపడ్డా................?

-


27 JAN 2021 AT 19:44

భూమిపై వెలసిన అందాలెన్నో,
అన్నీ చూసే అదృష్టం లేదుగా ఈ కంటికి
పయనించే దారికి అంతమెక్కడో
తెలియదు కదా ఈ చిట్టి పాదానికి,
చేయి చాచి అడిగే ఈ నిస్వార్థపు మనసుకి
తెలియదు కదా,
అందుకోలేని ఎత్తులెన్నో,
పట్టుకోలేని మాయలెన్నో,
దాచుకోలేని సొమ్ములెన్నో,
మూయలేని దారులెన్నో,
తట్టుకోలేని బాధలెన్నో,
మోయలేని గుర్తులెన్నో,
అంతులేని భావాలెన్నో,
కానరాని పాయలెన్నో,
మట్టిలో కలిసిపోయే ప్రాణం అనే జీవనదికి.






-


27 JAN 2020 AT 11:49

ఓ చిరునవ్వు నాకు అంతటి
ధైర్యం అందించినపుడు తెలిసింది,

గెలుపు కంటే దానికై పడే పాటు గొప్పదని...
ఆ ప్రయత్నం ఓటమికి దారి తీసినా
సంతోషాన్నే ఇస్తుందని తెలిసింది,

ఎందరు నను వీడి వెళ్లినా
తన చేయందించి తోడుగా నిలిచిన
ఆ స్నేహం విలువ అప్పుడే నాకు తెలిసింది,

నేను కోరుకున్న ప్రేమ,
నేను కోల్పోయానని భ్రమ పడిన ప్రేమ
నాలోనే ఉన్నాయని
ఎప్పటికీ నాతోనే ఉంటాయని తెలిసింది

ఈ జీవితం విలువ తెలిసింది
నా ప్రాణం విలువ నాకు తెలిసింది

-


26 APR 2021 AT 10:52

మాట ఒదిలితే
తీసుకోలేము
ఊపిరి ఒదిలితే
తిరిగి బతకలేము

-