ఓ నయనమా ఎవరికోసం ఈ తీక్షణం
ఆశ, నిరాశ ల
ఊహలలలో ఊగిసలాడే
ఉచ్ఛ్వాస,నిశ్వాస ల
ఊయలలో కదులుతూ
తనువును ఒకే చోట నిలుపుతూ.
-
😄Welcome to my profile😄
From 13th July 🎂🎂🎂I'm started ♥ Im 25♥
I... read more
నీ అడుగులకు దారులు వేస్తూ
అలలతో నీ పాదాలను అభిషేకిస్తూ
నల్లమబ్బులతో పందిరికడుతూ
కెరటాలతో ఆకాశంలో హరివిల్లులు వేస్తూ
ఆహ్వానించదా నిన్నే తన ఇంటికి ఆ సంద్రమే
నా మదిలో తన ప్రేమకై వేస్తున్న పునాదులు చూసి
తాను దాచుకున్న లోతులన్నీ చిన్నవే అని చూపించేందుకు.
-
పద పద పాదమా
పరిగెడుతూ పాడవే
నీ గాథనే
గాలే పాడొద్దని పెదవులకు అడ్డుపడదుగా నేస్తమా
వినే చెవులే లేవని నీ కనులే నిన్ను వెక్కిరించవుగా నేస్తమా
చప్పుడు చేయక ఆగిపోతానంటే ఇక బ్రతుకెక్కడ ఆ గుండెకి ఓ నేస్తమా
ఎదురయ్యే ఒక్కో ఓటమికి
దొరికే అవమానాలే
ఉడికించవా నీ రక్తాన్ని
మరో ఇంధనమే అవసరమే లేదులే
నీకు విజయం దొరకడం గగనమే అనరా తప్పిన మొదటి అడుగే చివరి అడుగుగా చూపి
లోలోపల జరుపవా ఓ మథనమే అన్న ఒక్కో ఘాటు పలుకుల గుంతలు దాటి
నీకు నువ్వే ఓ గతం
నీకు నువ్వే ఓ భవిత
నీకు నువ్వే ఓ సాధన
నీకు నీవే ప్రతీక్షణం...
నీకు నీవే ఆనందం...
నీకు నీవే ఓ లోకం.
-
ఆ సంద్రాన్నే ఆవిరి చేసి
నీలో నింపుకున్నావా ఓ మేఘమా...
ఇంకెంత సేపు కురిపిస్తావు...
ముంచింది చాలు బొట్టు బొట్టుగా తన ఊసులు చెప్పి
కదలవా ఇకనైనా..-
మన దూరాన్ని కలిపేందుకు
ఆకాశమే పందిరవదా
ఉరుములే భజంత్రీలవవా
మెరుపులే చిత్రాలు తీయవా
తోరణాలుగా మారవా కొండ కోన చెట్టూ చేమా
ప్రతీ ప్రాణి చూసే కళ్ళే సాక్షాలై
అవి చేసే ప్రతీ శబ్దమే వేదమంత్రాలై
కురిసే ప్రతీ చినుకే అక్షింతలుగా తాకుతున్నప్పుడు
హరివిల్లే మంగళసూత్రమవదా
మనం వేసే ఏడుఅడుగులనే ఏడురంగులుగా దాచుకోదా.
-
కొందరు ఊపిరి తీసేందుకు ప్రేమిస్తారు.
కొందరు ఊపిరి ఆగిపోతుందేమో అని ప్రేమిస్తారు.-
ఈ విశ్వంలో నీది నాది ఒకే కథ ఓ చందమామ
మన ఇద్దరి బాధే చీకటి కమ్మే అమావాస్య అవ్వదా ఈ జగతికి
మన ఇద్దరి సంతోషమే వెలుతురు పంచే వెన్నెల అవ్వదా ఈ జగతికి-
నా ముందు నువ్వు వేసిన ఒక్కో అడుగు ఓ ప్రశ్నేగా
నా మౌనానికి,
నీ వెనక నే నడిచిన అడుగులే సమాధానాలుగా
నా భయానికి.
ఓ పిచ్చి మనసా
ఆగదులే ఈ పయనం
ఎప్పుడో వేసేసావే ఏడడుగులే
నేనో విప్పలేని గట్టిముడినే
నువ్వో అర్థం కాని చిక్కుముడివే
నిన్ను చూసినప్పుడే నా మనసే ఓ ముడివేసేసిందే
మళ్ళీ వేయడం అవసరమా మూడు ముడులే
నువ్వు లేక నేను లేను అనే మాటే మన ప్రేమకు సర్వస్వం అయినప్పుడు మంగళసూత్రం ఎందుకే.-
బయటికి కనపడట్లేదే గాయం యదలో బాణాలు గుచ్చుకుంటున్నా,
కన్నీటి బొట్టే రాలట్లేదే కన్నీటి సంద్రంలో కెరటాలు ఎగిసిపడుతున్నా,
సైన్సుకే చిక్కని ఆయుధమేదో తనువును దాటి నా మనసును తాకింది.
సూర్యుడే కనని కిరణమేదో సంద్రాన్నే ఆవిరి చేసింది.
ప్రకృతే ఎరుగని మేఘమేదో సముద్రమంత నీటితో దాహాన్ని తీర్చుకుంది.-