మనో బుద్ధ్యహంకార చిత్తాలను
నిద్ర లేచినప్పుడు బ్రహ్మను...
వాటి మెలకువలో విష్ణువుని...
వాటిని నిద్రపుచ్చే రుద్రుడిని...
నిద్రలో వాటిని రక్షించే మహేశ్వరుడిని...
తిరిగి అనుగ్రహించే సదాశివుడిని...
వాటిని అధిష్టించిన లలితని...
ప్రతి రోజు సత్యానుభూతి కోసం
సాధన చేసే చతుష్టయానికి సాక్షిని...-
కవన రచనలో
ఏ ప్రక్రియని
అనుసరించకపోవడమే
నా ప్రక్రియ...
న... read more
పగోడికి కూడా రాకూడని కష్టాలు వాడివి,
అయినా వాడి నవ్వు వెనుక అవి మాయమే...
ఎన్ని బాధలు కలిసినా వాడ్ని కిందకి లాగలేవు,
అంత ఎత్తున ఉంది వాడి ఆనందజ్ఞానమే...
నీ వీపు తట్టేందుకు ఆ స్థితిలో ఏవరు లేరురా,
నీకు నీవే తట్టుకొని నిలబడరా శ్రావణేశ్వరా...-
Everyone gets hypnotized by truth...
Just be the truth,
world will get hypnotized towards you...-
I think, sending kids to school is just an extra expenditure to parents...
I didn't learn anything which is related to the purpose of life the ultimate thing from school...-
తానెపుడూ తననెపుడూ కాదనలేదే...
తానెపుడూ తననెపుడూ అవుననలేదే...
తనని తనకి, తననే తనకిచ్చే తనే తనని
తనకి తెలియనే లేదే...
తన తనువు కోరే తను తాను కాదని
తనలోని తనే తనని తను తెలుసుకోలేదే...
అయినా,
తానెపుడూ తననెపుడూ కాదనలేదే...
తానెపుడూ తననెపుడూ అవుననలేదే...
ఈ కావ్యపు పద చిక్కులుగా,
ఆ కాలపు కథకి దిక్కులుగా,
మాను వేరై, వేరుగా ఉండిపోయారే...-
నా తపనాగ్నికి
రాతిరి కాలిపోని,
చీకటి వెలిగిపోని...
నా ధ్యానాగ్నికి
ఊపిరి ఉడికిపోని,
అహం భస్మమైపోని...
నా అక్షరాగ్నికి
కావ్యం దీపమైపోని,
రేపటి రవి రగిలిపోని...
ఓ విశ్వమా, నా అశ్వమా,
నిన్ను అధిరోహిస్తా,
ఆనంతాన్ని అధిగమిస్తా...-
నీ భావ ప్రవాహంలో నా ప్రాణాలు కొట్టుకుపోయి
అనంతానంద సంద్రంలో గల్లంతయ్యాయి,
అమృత కుండల మండలం పగిలి ముంచెత్తాయి,
నీ నామస్మరణలో పులకితగాత్రుడినై భిక్షాటన చేసా,
హర్షిత నేత్రుడినై నన్నే మరిచి రుద్రభూమిలో తిరిగా,
నీ దివ్యత్వాన్ని చూస్తూ దివ్యచక్షువుని తెరిచా,
నీ సాంగత్యంలో నేను సదాశివుడినయ్యా,
నిన్ను కౌగిలించుకొని అర్థనారీశ్వరుడినయ్యా,
ఏం చెప్పను పార్వతి,
అనంతకోటి శివరూపాలను దాల్చి
అసంఖ్యాక కోటి కావ్యాలు రాసిన చెప్పలేను,
నీపై ఉన్న ప్రేమని...
నీవల్లే నేను ఇంతటి వాడినయ్యా,
శివుడినయ్యా, పరమశివుడినయ్యా...-
సంద్రం నేను ఉప్పొంగుతా, అని చెప్పదు...
నది నేను ప్రవహిస్తా, అని చెప్పదు...
పువ్వు నేను పరిమళిస్తా, అని చెప్పదు...
తేనే నేను తీపిగా ఉంటా, అని చెప్పదు...
పాము నేను కాటేస్తా, అని చెప్పదు...
పిడుగు నేను పడ్తా, అని చెప్పదు...
ఆకాశం నేను విశాలంగా ఉంటా, అని చెప్పదు...
వెన్నెల నేను చల్లగుంటా, అని చెప్పదు...
చెట్టు నేను నీడనిస్తా, అని చెప్పదు...
అలానే
మనిషి నేను ప్రేమిస్తున్నా అని చెప్పొద్దు...
ప్రేమ మనిషి సహజం లక్షణం,
పనిగట్టుకొని ప్రకటించుకోవద్దు...-
తను రాసుకునే తన కథలో
నా పాత్ర పుట్టేదెప్పుడో...
నేను రాసుకునే నా కథలో
తన పాత్ర కలిసేదెప్పుడో...
వేరు వేరుగా సాగే కథలు
వేరుకాక ఏకమయ్యేదెప్పుడో...-