ఎవరి పంతానికి వాళ్ళు
పెద్దపీట వేసుక్కూర్చుంటారని
అందరికీ తెలుసు..
ఐనా ఎందుకు?
ఈ ముసుగులో గుద్దులాటలు.
గౌరవాన్ని,పెద్దరికాన్ని
నిలుపుకోటానికేగా!
ఐనా గౌరవం దక్కినా
ఒరిగిందేముంది?
శిథిల పునాదిపై
ఎంతోటి గొప్ప మేడ గట్టదలచినా
ఏం లాభం?-
21 SEP 2019 AT 20:51
18 MAY 2017 AT 11:00
ఓ నా మనసా
దోబుచులాటేల???
నీతో నేను గెలవగానే!!!
లోలోపల
నన్ను
అంతం చేయాలన్న ,
నేను
శాంతం గా ఉండాలన్న ,
నాతో
పంతం పెట్టాలన్న
నీకే సాధ్యం.
---శర్మిష్ట---
-
13 JUN 2018 AT 23:39
నేను ఎందుకు ముందు క్షమాపణ చెప్పాలి
అనుకుంటే దూరం పెరుగుతుంది..
నేను ఎందుకు ముందు క్షమాపణ చెప్పకూడదు
అనుకుంటే దూరం తగ్గుతుంది..
-- క్రాంతి కొడితాల-
3 MAR 2019 AT 13:16
పంతాలు పౌరుషాలు మంచి కోసం రావాలికానీ
మనుషుల్ని విడదీయడానికో, ఒదులుకోవడానికో రాకూడదు.-