నీ అనే రోజు, నీవు అనుకునే రోజు కోసం నువ్వు ఎన్ని రోజులుగా వేచి చూసావ్ అన్నది ముఖ్యం కాదు..
నీ రోజు అంటూ వచ్చాక ఇన్ని రోజులుగా నిన్ను ఇబ్బంది పెట్టిన వారికి నువ్వు ఇచ్చే సమాధానం ఎలా ఉంటుంది అన్నది ముఖ్యం..
-
You can wish me on December 25th.
నేను చేసే... read more
గాయపడ్డ పులి ప్రతీకారం కోసం ఎదురుచూసినట్టు..
బాధపడ్డ మనిషిగా మంచికాలం కోసం ఎదురుచూస్తున్నా..
-
ఏదైనా మాట్లాడినప్పుడు తుమ్మితే సత్యం అని నమ్మే ఈ జనాలు..
ఏదైనా మొదలెట్టినప్పుడు తుమ్మితే మాత్రం అపశకునం అంటారు ఇదే జనాలు..
అవసరం, అవకాశం, సమయం, సందర్భం బట్టి అన్ని మారిపోతాయి..
ఆచారమైనా, అనుబంధమైనా, స్నేహమైనా, ప్రేమైనా, బంధమైనా, బంధుత్వమైనా...
-- ✍️ క్రాంతి కొడితాల-
అడగక ముందే ఇచ్చే సలహా, విలువ తెలియని వారికి తెలిపే అభిప్రాయం..
పిలవని పేరంటానికి వెళ్ళడం లాంటిది..
ఇచ్చిన సలహా కు, తెలిపిన అభిప్రాయానికి, వెళ్ళిన మనిషి కి విలువ ఉండదు..
-- ✍️ క్రాంతి కొడితాల-
నువ్వెంత..
అగ్నిలోని కణికంత..
కడలిలోని బిందువంత..
పుడమిలోని రేణువంత..
నింగిలోని నక్షత్రమంత..
గాలిలోని ధూళిఅంత..-
నేను అనుకునే ఒక మార్పు ని ఎంతో ఓర్పుగా అలవర్చుకుందామనుకున్న ప్రతీ సారి నన్ను నేను ఓడించుకుంటున్నాను ఆ మార్పు ని అలవర్చుకోలేక..
నేను అనుకునే ఆ మార్పుని ఎంతో నేర్పుగా నేర్చుకుందామనుకున్న ప్రతీ సారి నన్ను నేను నిందించుకుంటున్నాను ఆ మార్పుని నేర్చుకోలేక..
నేను అనుకునే ఆ మార్పు నాలో కూర్పు అయ్యేది ఎప్పుడో తద్వారా నా ఆత్మాభిమానాన్ని కాపాడుకునేది ఇంకెప్పుడో..
-
సమాధానం దొరికే ప్రశ్నలతో సమస్యే లేదు అసలు..
సమాధానం దొరకని ప్రశ్నలతోనే అసలు సమస్య..
అలాంటి ప్రశ్నలకు సరైన సమాధానం దొరికే సరైన సమయం కోసం మౌనంగా, ఓపికగా వేచి చూడడం మాత్రమే మనం చెయ్యగలిగేది..
-
అందం, డబ్బు, పొగరు ఆభరణాలు అనుకునేవారు..
అందం వయసు ఉన్నంత వరకే..
డబ్బు నిలుపుకున్నంత వరకే..
పొగరు మనిషి ఉన్నంత వరకే..
అని తెలుసుకోలేక పోతున్నారు..-
నువ్వు ఆయుధాలతో చేసే యుద్ధం ఇతరులతో..
అదే
నువ్వు ఆలోచనలతో చేసే యుద్ధం నీతో..-