మారుతున్న మనిషినననా
మార్పు తెలియని మనసునననా...
ఓర్పు ఎరుగని వయసునననా
వేదనంతా తెలిసినా వాదనమాననట్టి మట్టిమేధస్సునననా...
ఏమని ఎదిరించను నరుడి నికృష్టపు కార్యాలను
నేనెవరని నిందించను ఆ నీతిదప్పిన నీచులను-
కాలం గడిచినా కన్నీళ్లు ఆగట్లేవు...
జారుతున్న కన్నీరైనా నా కలాన్ని కదింలించట్లేవు...
మారుతున్న మనుషులే కారణమేమో...
గాయపడిన మనసుకి మసిపూసి మంత్రం వేసారేమో...
అందుకే
బయటకు తెలియకుండా భరించలేని బాధతో...
బతకాలో...చావాలో తెలియని స్థితిలో
మతిమరిచిన మది చితిమంటలో
చిముకు చిముకు మంటూ బూడిదవ్వమంటుంది...
కానీ,
నా చావు పలువురి పెదవులపై చిరునవ్వును సమకూర్చినా సరే...
దాంతో వారిలో
అణువణువున తనువంతా ఉదయించిన
అహం,అన్యాయం ,ఆవేశం,అత్యాషలన్నీ
అస్తమిస్తే చాలు...
మరలా రేపటి ఉదయంలో నేనే
రగిలే రవిలా ఉదయించి
ఈ ధరణి అంతటా
ధర్మపు తావినై విరబూస్తా...!!-
అందరిలో(తో)
నిజాలు చెప్పి
నిజాయితీగా ఉండడం కూడా తప్పే...
ఎందుకంటే
నిజం నిప్పు కదా...!
అందరి హృదయాల్నీ కాల్చేస్తుంది పాపం...
-
కలలకు కొద్దిగైనా
అవకాశం ఇవ్వట్లే
నా కనులు...
బహుశా
నిండా నీ ఊసులే నింపుకున్నాయేమో...-
నాలోని నీ కలలు
కనుల వెంట కన్నీరుగా మారాయి
కథలుగా మిగలాల్సిన మన జ్ఞాపకాలు
వట్టి వ్యథలుగా మిగిలాయి
మనసులు దగ్గరయ్యాయ్ అనుకున్నా...
లేదూ...
మనుషులం మాత్రమే దగ్గదయ్యామ్
అని...నీ నుండి దూరమయ్యాకే
తెలిసింది...!-
బాధల్లో భరోసాగా ఉండకున్నా సరే
కానీ...
ఆ బాధను చెప్పుకునేందుకు చిరుబంధమై
చెంతే ఉండు చాలు...-
అనుమానపు పెనుభూతం...ఓ అప్సరస
కానీ అది...
అర్థం చేసుకోలేని మనసు(షు)ల్ని మాత్రమే
ఆకర్షిస్తుంది....ఆవహిస్తుంది...!!-
బ్రతుకు భారమైతే కంట కారే కన్నీరు మారలేదు
బాధల్ని భరిస్తూ బతికేటి బాధ్యత తీరు మారలేదు
కారాగారాన కాలం గడుపుతున్న ఖైదిలా ఉన్నా
ప్రేమను పొందేందుకు ప్రతిక్షణం చేసే పోరు మారలేదు
మంచి నను వేసవి వేడిన మంచు వానలో ముంచుతున్నా
మనసుపైన మరకలా మదపు ముసుగైన తారు మారలేదు
దుర్మార్గంగా దోచుకుతినే దొరగారు గద్దె దిగాలని
తుంటరోన్ని ఒంటరిగ ఉద్యమించినా ఊరు మారలేదు
శివా! కనుల ముందు కలిగే కష్టాలను కథలాగా అల్లి
కవినై కోపంగా కంపించినా నా పేరు మారలేదు-