మనుషులు నిజంగా తప్పు చెసేటట్టే మీరు అనుకుంటే, ఆ తప్పు వల్ల వాళ్ళ జీవితం తప్ప మరి ఎవరి జీవితం ప్రభావితం కానప్పుడు. అలాంటి తప్పుచేసే స్వేఛ్ఛ ఇచ్చినప్పుడే కదా మనిషి అది తప్పు అని తెలుసుకుంటాడు.
జీవితంలో ప్రతీ ప్రశ్నకి సతమతమయ్యే మనం అవతలి వాళ్ళ సమస్యలకి మాత్రం చాలా తేలికైన పరిష్కారాలు ఇచ్చేస్తాం. ఎందుకంటే పర్యవసానం అనుభవించాల్సింది మనం కాదు కదా...-
మనం ఎవరి జీవితాల్ని చెక్కదిద్దాల్సిన అవసరం లేదు.
వాళ్ళు బ్రతకాలనుకున్నట్టు వాళ్ళని బ్రతకనిస్తే చాలు.
అది జరగనిస్తే నిజంగా వాళ్ళ జీవితాలు మీరు బాగుచేసినట్టే.-
మనం చేసే పని
అవతలి వాళ్ళని బాధ పెడితే
అది మంచే అయినా చెడుతో సమానం.
లేదు ఇక్కడ మంచికి మాత్రమే విలువ
అంటే మనిషికి మనసే అవసరం లేదు.
ఒక ప్రణాళిక మాత్రం సరిపోతుంది,
ఏది మంచి ఏది చెడు అని.
కానీ, ఆ ప్రణాళిక రాయడానికి
కావలసింది కూడా మనసే....
మనిషిని బాధపెడితే
తేలికగా మరిచిపోవచ్చు
మనసుని బాధ పెడితే....?-
మనని మనం వదిలెళ్ళిపోతే
అది చావు అంటారు.
మనని మనం వెతుక్కుంటూ వెళితే
దాన్నే బ్రతుకు అంటారు.-
సమాజంలో మనని
కిందకి లాగే చేతులు ఎన్నున్నా,
ముందుకు లాగే మనసు
ఒక్కటీ ఉంటే చాలు.-
కాలం చేసే మజిలీలో
కాలే పేజీలే మనవి
కాలికి తగిలినదెబ్బలతో
ఆగేదేం తెలివి-
మంచి చెడు పక్కనపెడితే,
ఏ మనిషి మజిలీ అయినా చివరికి చావు వైపుకే.
ఈ మూణ్ణాల ముచ్చటలాంటి జీవితంలో
మనుషుల్ని వదులుకొనేంత పంతాలకీ,
వదులుకోలేనంత మోహాలకి విలువ శూన్యం.-
నీలో వెతకాల్సిన మంచిని,
ప్రపంచంలో వెతుకుతూ,
దాన్నే ప్రశ్నిస్తూ కూర్చుంటే,
నీలో నువ్వెప్పుడు ఆ మంచిని చూస్తావ్ ?-
గమ్యం అంటే గమనం ఆగిపోయే చోటు కాదు,
గమనం సరికొత్తగా మొదలయ్యే చోటు.-